Breaking News

జపాన్ ను ముంచెత్తుతున్న వరదలు..!

09 th Jul 2020, UTC
జపాన్ ను   ముంచెత్తుతున్న వరదలు..!
ప్రకృతి కోపిస్తే.. తట్టుకోవడం మానవ తరమైనది కాదు.. ఇప్పటికే.. కరోనా సంక్షోభాన్ని యావత్ ప్రపంచం ఎదుర్కుంటోంది.. ఈ సంక్షోభం తీరకమునుపే.. భారత్ లో పలు చోట్ల భూకంపాలు... వరదలు వచ్చాయి.. తాజాగా.. ప్రస్తుతం జపాన్ కూడా వరస భారీ వర్షాలతో తల మునకలవుతోంది.. జపాన్ లో వరుస భూకంపాలు.. వస్తూనే ఉంటాయి.. అయితే.. గత కొన్ని రోజులు గా భారీ వర్షాలు జపాన్ వాసులను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి.
 
ఇప్పటివరకు దక్షిణ జపాన్లో విజృంభించిన వర్షాలు తాజాగా ఈశాన్య ప్రాంతాల్ని వణికిస్తున్నాయి. గత కొన్ని రోజులు గా భారీ గా వర్షాలు కురుస్తుండడం తో.. నదులు ఉప్పొంగుతున్నాయి.. రోడ్లన్నీ కూడా జలమయం అయిపోయాయి.. ప్రధాన ద్వీపపు ప్రాంతాలు కూడా ఈ వర్షాల తాకిడి కి నీట మునుగుతున్నాయి.. ఈ వరదల తాకిడి కి ఇప్పటికి 58 మంది మృత్యువాత పడ్డట్లు.. జపాన్ ప్రభుత్వం తెలిపింది.. ఎక్కువగా కుమమోటో ప్రాంతంలోనే  మరణాలు సంభవిస్తున్నాయి.
 
నగావో, గిఫూ ప్రాంతాల్లో వరదల తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు అక్కడి మీడియా తెలుపుతోంది. ఈ వరదల కారణం గా  ప్రముఖ పర్యాటక కేంద్రమైన నగావోలోని కొండచెరియలు విరిగిపడి సుందర పర్వత మార్గాలు కూడా దెబ్బ తిన్నాయి.. గెరో నగరం ద్వారా ప్రవహించే నదులు వంతెనలకు ఆనుకొని ప్రవహిస్తుండడంతో పరివాహక ప్రాంతం మొత్తం నీటమునిగింది. అకస్మాత్తు గా వచ్చిన వరదల వలన వేల సంఖ్యలో పర్యాటకులు ఆ ప్రాంతాల్లో చిక్కుకుపోయారు. మరో వైపు.. లోతట్టు ప్రాంతాల్లో ఉండే ప్రజలను అక్కడినుంచి ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలి పోవాలని ప్రభుత్వం హెచ్చరికలు చేస్తోంది. దాదాపు 36లక్షల మంది నిర్వాసితులకు నివాస ఏర్పాట్లు చేసినట్లు ప్రభుత్వం పేర్కొంది.  ముంపు ప్రాంతాల్లో.. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి.  

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox