Breaking News

నారింజ పళ్లు అమ్ముకుంటూ పాఠశాల నిర్మించాడు.. పద్మశ్రీ ని పొందాడు

09 th Nov 2021, UTC

కర్ణాటక మంగళూరుకు చెందిన నారింజ పళ్లు అమ్ముకునే  హరేకల హజబ్బ సోమవారం  భారత రాష్ట్రపతి నుండి భారతదేశపు రెండవ అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీ అవార్డును అందుకున్నాడు. 66 ఏళ్ల హజబ్బ మంగళూరులోని హరేకల-న్యూపడ్పు గ్రామంలో పాఠశాలను నిర్మించడం ద్వారా గ్రామీణ విద్యలో విప్లవం తీసుకొచ్చినందుకు ఈ అవార్డును అందుకున్నాడు. ఈ పాఠశాలలో ప్రస్తుతం గ్రామానికి చెందిన 175 మంది నిరుపేద విద్యార్థులు ఉన్నారు.

1977 నుండి మంగళూరు బస్ డిపోలో నారింజ పండ్లను విక్రయిస్తున్న శ్రీ హజబ్బ నిరక్షరాస్యుడు. 1978లో ఒక విదేశీయుడు నారింజ పండు ఖరీదు అడిగినప్పుడు  అతను చెప్పలేకపోయాడు. తనకు చదువు లేనందునే అతనితో మాట్లాడలేకపోయానని భావించాడు. ఒక్క కన్నడ భాష తప్ప ఇంగ్లీషు, హిందీ రాకపోవడం వలన తాను పడిన ఇబ్బంది  అతడిని బాధించింది. దీనితో తన గ్రామంలో విద్యలో విప్లవం తీసుకురావాలనే కోరికతో పాఠశాల నిర్మించాలని నిర్ణయించాడు. దీనితో అతను అప్పటి ఎమ్మెల్యే యుటి ఫరీద్ ను సంప్రదించి పాఠశాల నిర్మాణానికి అనుమతులు సంపాదించాడు. కేవలం 28 మంది విద్యార్థులతో ప్రారంభమైన ఈ పాఠశాల ఇప్పుడు 10వ తరగతి వరకు 175 మంది విద్యార్థులకు వసతి కల్పిస్తోంది.

హజబ్బ కృషికి తగిన గుర్తింపు లభించింది. పలు సంస్దలు అతడిని అవార్డులతో సత్కరించాయి. అతనికి అక్షరసంత అనే బిరుదు కూడ ఇచ్చారు. హజబ్బ అవార్డుల ద్వారా వచ్చిన ప్రైజ్ మనీని తన గ్రామంలో మరిన్నిపాఠశాలలు నిర్మించడానికి పెట్టుబడిగా వినియోగించాలని నిర్ణయించాడు. తన గ్రామంలో  గ్రామంలో ప్రీ-యూనివర్శిటీ కళాశాల (11 మరియు 12 తరగతుల విద్యార్థుల కోసం) నిర్మించాలని ప్రధాని నరేంద్ర మోడీని అభ్యర్థించినట్లు హజబ్బ తెలిపాడు.

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox