Breaking News

జన గాయకుడు నిస్సార్ మూర్తి పై హరీష్ రావు స్పందన..!

08 th Jul 2020, UTC

జన గాయకుడు నిస్సార్ కరోనా మహమ్మారి కారణం గా మృతి  చెందారు. ఆయన మృతి పై పలువురు ప్రముఖులు తమ సంతాపాన్ని తెలిపారు. తెలంగాణలో ఉద్యమ గాయకుడిగా పేరు ప్రఖ్యాతులు అందుకున్న జన గాయకుడు  నిస్సార్  మృతి పై తెలంగాణ మంత్రి హరీష్ రావు స్పందించారు. తెలంగాణ పాటను సారవంతం చేసిన కళాకారుడు నిస్సార్ అని హరీష్ రావు ఆయనను కొనియాడారు. నిస్సార్ మృతి  పై హరీష్ రావ్ ఆవేదన చెందారు. బస్ కండక్టర్ గా పని చేసిన నిస్సార్.. పాటల ప్రయాణాన్ని అర్ధాంతరం గా నిలిపేశారని బాధపడ్డారు. పేద ముస్లిం కుటుంబంలో జన్మించిన అతను అనేక ఉద్యమాలకు పాటల ప్రాణవాయువునిచ్చాడని కొనియాడారు. నల్లగొండ జిల్లా ఉద్యమ చైతన్యాన్ని ఆవాహన చేసుకున్న నిస్సార్.. అంటూ  మంత్రి హరీష్ రావు ట్విట్టర్ మాధ్యమం ద్వారా స్పందించారు. ప్రపంచీకరణ లో మాయమైపోతున్న తెలంగాణ సంస్కృతి కి నిస్సార్ జీవం పోసాడు. సభల్లో నిస్సార్ ఆలపించే పాటల్లో.. పండు వెన్నెల్లలోన పాడేటి పాటలేమాయె' అనే పాట 'తెలంగాణ ధూం ధాం' వంటి పాటలు చాలా ఆకర్షనీయం గా ఉండేవని హరీష్ రావ్ తెలిపారు. తెలంగాణ ఉద్యమ జ్వాలా గీతం వంటి నిస్సార్ కు కన్నీటి నివాళి అర్పిస్తున్నామని  హరీష్ రావు బాధాతప్త హృదయం తో తెలిపారు. 

Read latest తప్పక చదవాలి | Follow Us on Facebook , Twitter

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox