Breaking News

ఆ డాక్టర్ బిగ్ బాస్ షో చూపిస్తూ, బ్రెయిన్ సర్జరీ చేసేసాడు!

21 st Nov 2020, UTC

గుంటూరు :సాధారణంగా ఆపరేషన్ అంటే మత్తు మందు ఇచ్చి చేస్తారు. కొన్ని సార్లు మెదడుకి ఆపరేషన్ చేయాలి అంటే ఆక్టివ్ గా ఉండాల్సి ఉంటుంది. మెదడు చాల సున్నితమైన భాగం. ఈ భాగానికి ఆపరేషన్ చేస్తున్నపుడు ఎలాంటి చిన్న తేడాలు జరిగినా, పేషెంట్ కోమాలోకి వెళ్లిపోయే ప్రమాదం ఉంటుంది. అందుకే, ఎంత అనుభవం ఉన్న డాక్టర్లు అయినా మెదడుకు సంబంధించిన శస్త్ర చికిత్స చేసే ముందు చాలా అలెర్ట్ గా ఉంటారు. తాజాగా, గుంటూరుకు చెందిన వైద్యులు అలాంటి ఆపరేషన్ ను చిత్రంగా, విజయవంతంగా పూర్తి చేసారు. 

డాక్టర్లు భవనం హనుమా శ్రీనివాసరెడ్డి, శేషాద్రి శేఖర్‌, త్రినాథ్‌ లు ఈ ఆపరేషన్ ను విజయవంతంగా పూర్తి చేసారు. పాటిబండ్లకు చెందిన వరప్రసాద్‌(33)కు మెదడులో కణితి(బ్రెయిన్‌ ట్యూమర్‌) వచ్చింది. ఈ కణితి ని 2016లోనే హైదరాబాద్ వాడిటీకీ శస్త్ర చికిత్స ద్వారా తొలగించారు. ఆ తరువాత పలుసార్లు రేడియేషన్ చేసినప్పటికీ ఫలితం దక్కలేదు. మెదడులో కణితి మళ్ళీ పెరుగుతోందని గమనించారు. ఈ సారి కణితి ఎక్కడ ఉందొ అక్కడ మాత్రమే తొలగించడం చేయాలనీ వైద్యులు భావించారు. నావిగేషన్ సాంకేతికత సాయం తో ఈ వైద్యం చేయాలనుకున్నారు. 

ఈ నెల పదవ తేదీన, ఈ మెదడు ఆపరేషన్ కోసం ఒక త్రీడి మాప్ ను తయారు చేసుకున్నారు. సర్జరీ చేయాల్సిన ప్రాంతం మాటలు, సంభాషణలకు కీలకమైన ప్రాంతం.కాబట్టి వైద్యులు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. రోగిని మెలకువగా ఉంచి, అతనికి బిగ్ బాస్ షో, అవతార్ సినిమాలను చూపిస్తూ, మాట్లాడుతూ ఉండగా మెదడులో ఎలాంటి పరిణామాలు జరుగుతున్నాయో పరిశీలించి, ఆ ప్రాంతంలో ఉన్న కణితిని తొలగించేసారు. విజయవంతంగా ఈ ఆపరేషన్ పూర్తి అయింది. రోగి పూర్తిగా కోలుకోవడంతో శుక్రవారం డిశ్చార్జ్ చేసేసారు. మరిన్ని వార్తలు చదవండి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox