Breaking News

తెలంగాణలో అందరికీ ఫ్రీ వ్యాక్సిన్... కేసీఆర్

24 th Apr 2021, UTC

తెలంగాణలో అందరికీ ఉచితంగా కొవిడ్ వ్యాక్సిన్ ఇవ్వాలని నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. రాష్ట్ర జనాభా మాత్రమే కాకుండా, ఇతర రాష్ట్రాల నుండి ఇక్కడికి వచ్చి అనేక రంగాల్లో పనిచేస్తున్న వారందరికీ ఉచితంగా వ్యాక్సిన్ ఇస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో సుమారు 4 కోట్ల మంది దాకా ప్రజలు ఉన్నారని, వీరిలో ఇప్పటికే 35 లక్షల మందికి పైగా వ్యక్తులకు వాక్సినేషన్ (టీకా) ఇవ్వడం జరిగిందని తెలిపారు. మిగతా అందరికీ వయసుతో సంబంధం లేకుండా వాక్సినేషన్ ఇస్తామని కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు ఆయన కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది.

ఇలా మొత్తం అందరికీ వాక్సినేషన్ ఇవ్వడానికి సుమారు రూ.2,500 కోట్లు ఖర్చు అవుతుందనీ, ప్రజల ప్రాణాల కంటే డబ్బు ముఖ్యం కాదనీ కేసీఆర్ అన్నారు. దీనికి సంబంధించిన ఆదేశాలను ముఖ్యమంత్రి. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, వైద్యశాఖ అధికారులకూ ఇచ్చినట్లు ప్రకటనలో పేర్కొన్నారు. ఇప్పటికే భారత్ బయోటెక్ వాక్సినేషన్ తయారీ చేస్తుందని, రెడ్డీ ల్యాబ్స్‌తో సహా మరికొన్ని సంస్థలు వాక్సినేషన్ తయారీకి ముందుకు వచ్చాయని, కాబట్టి వాక్సినేషన్ విషయంలో ఎలాంటి ఇబ్బంది ఉండబోదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

రెండు మూడు రోజుల్లో తనకు అవసరమైన వైద్య పరీక్షలు జరిగి, పూర్తి స్వస్థత చేకూరిన తరువాత సంబంధిత అధికారులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించి వాక్సినేషన్ కార్యక్రమాన్ని స్వయంగా పర్యవేక్షిస్తానని ముఖ్యమంత్రి అన్నారు. వాక్సినేషన్ కార్యక్రమం పటిష్ఠంగా, విజయవంతంగా అమలు చేయడానికి జిల్లాలవారీగా ఇంచార్జులను నియమించడం కూడా జరుగుతుందని సీఎం కేసీఆర్ చెప్పారు.

ప్రజలు అధైర్య పడవద్దని, ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉండవద్దని సీఎం కోరారు. జనం పెద్ద ఎత్తున గుంపు గుంపులుగా కూడవద్దని, ఊరేగింపులలో పాల్గొనవద్దని, అత్యవసరమైతేనే తప్ప బయట తిరగవద్దని సూచించారు. ఎల్లప్పుడూ స్వయం క్రమశిక్షణ పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రజల క్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న ప్రభుత్వం కరోనా మహమ్మారి విషయంలో చేయాల్సినదంతా  చేస్తుందని కేసీఆర్ మరోమారు చెప్పారు.

Read latest తప్పక చదవాలి | Follow Us on Facebook , Twitter

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox