రాజస్తాన్ :సమాజంలో ఎంత అశాంతి వున్నా, ఎన్ని అకృత్యాలు జరుగుతున్నా ప్రజల్లో దేముడి పట్ల భయం,పాపభీతి కొంతమేరకైనా వున్నాయి. దేవుడు తమపై ఆగ్రహిస్తాడనే భయంతో దొంగిలించిన సొమ్ములో సగం తిరిగి ఇచ్చేసిన సంఘటన ఒకటి రాజస్తాన్ లో జరిగింది. రాజస్థాన్ నాగౌర్ జిల్లాలోని బాడి ఖాటు గ్రామంలోని హజ్రత్ సమన్ దివాన్ యొక్క దర్గా హుండీనుంచి డిసెంబర్ 17న కొంతమంది వ్యక్తులు రూ.2 లక్షలు దొంగిలించారు. అయితే అక్కడి సిసిటివి కెమెరాలు పనిచేయకపోవడంతో పోలీసులు దీనికి సంబంధించి ఎటువంటి ఆధారాలు సేకరించలేకపోయారు.
అయితే తాజాగా సోమవారం ఉదయం అయితే, సోమవారం ఉదయం, దర్గా సమీపంలో పడివున్న రూ. 93,514 రూపాయల నోట్ల కట్టలను చూసి గ్రామస్తులు షాక్ అయ్యారు. తరవాత వీటిని దర్గాకు సంబంధించినవిగా నిర్దారించి పోలీసులకు అందించారు. తాము దొంగిలించింది దర్గా సొమ్ము కాబట్టి, "పిర్ బాబా" (పవిత్ర సాధువు) తమపై ఆగ్రహం వ్యక్తం చేస్తాడనే వీరు ఈ విధంగా చేసినట్లు తెలుస్తోంది. మొత్తం మీద దేముడి మీద వున్న భయం దొంగలను తిరిగి కొంత సొమ్ము ఇచ్చేలా చేసిందని గ్రామస్తులు అంటున్నారు.
సంవత్సరాల క్రితం కేరళలో కూడ ఇటువంటి సంఘటన జరిగింది. ఒక ఇంటి నుండి బంగారు ఆభరణాలను దొంగిలించిన ఒ దొంగ రెండు రోజుల తరువాత క్షమాపణ లేఖతో తిరిగి ఇచ్చాడు. తనను అరెస్టు చేయవద్దని విజ్ఞప్తి చేస్తూ, ఇలా రాశాడు. దయచేసి నన్ను అరెస్టు చేయవద్దు. క్షమించండి. నా పరిస్దితుల కారణంగానే ఇలా చేసానంటూ రాసాడు. మరిన్ని వార్తలు చదవండి

Read latest జాతీయ వార్తలు | Follow Us on Facebook , Twitter
Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox
26 Feb 2021
25 Feb 2021
26 Feb 2021
26 Feb 2021
26 Feb 2021