Breaking News

చెన్నై శునకానికి కోల్ కతా శునకం రక్తదానం..!

09 th Jul 2020, UTC

చెన్నైకి చెందిన ఓ జంట తమ పెంపుడు కుక్కను కాపాడటం కోసం  కోల్‌కతా వెళ్లి అక్కడ మరో కుక్క యజమానిని ఆశ్రయించారు. కోల్‌కతాలో లాబ్రడార్ జాతికి చెందిన శునకం ‘సియా’ దానికి రక్తదానం చేసి కాపాడింది.

ఈ జంటకు చెందిన డానీ అనే 13 ఏళ్ల పెంపుడు కుక్క కిడ్నీ సమస్యతో బాధపడుతోంది. కొంత కాలంగా డానీకి చికిత్స కోసం దాని యజమానులు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. బెంగాలీ యాక్టర్ అనింద్య ఛటర్జీ ఆ శునకం ప్రాణాలు కాపాడటానికి ముందుకొచ్చారు. తన పెంపుడు కుక్క సియాను రక్తదానానికి సిద్ధం చేశారు. కోల్‌కతాకు చెందిన వెటర్నరీ డాక్టర్ దెబాజిత్ రాయ్.. ఆ  కుక్క కు రక్తమార్పిడి చేసి ప్రాణాలు నిలిపారు.

రక్తదానంసమయంలో సియా ఎలాంటి ఆందోళన లేకుండా చాలా కూల్‌గా ఉంది. ఎలాంటి ఇబ్బంది పడకుండా పనిని పూర్తి చేసింది. ఇందుకు కేవలం 15 నిమిషాల సమయం మాత్రమే తీసుకుంది. సియా చేసిన సాయం వల్ల నాకు ఈరోజు గర్వంగా ఉంది. డానీని కాపాడుకునేందుకు ఓ జంటకు ఆమె (సియా) సాయం చేసింది’ అని అనింద్య పేర్కొన్నారు.

డానీ దీర్ఘకాలిక మూత్రపిండ సమస్యతో బాధపడుతోందని డాక్టర్ దేబాజిత్ రాయ్ తెలిపారు. ‘డానీకి చికిత్స అందించడానికి సరిపోయే రక్తం కావాల్సి వచ్చింది. అయితే.. సరైన అవగాహన లేకపోవడం వల్ల సాయం చేయడానికి ఎవరూ దొరకని పరిస్థితి. కోల్‌కతాలో ఇలాంటి చికిత్స కూడా కొత్తది. కానీ, డానీకి చివరికి రక్తదాత లభించినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది ఆయన అన్నారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox