Breaking News

ఒక్క రూపాయికే టిడ్కో ఇల్లు సీఎం జగన్ సంచలన ప్రకటన

19 th Nov 2020, UTC

ఆంధ్రప్రదేశ్ :అర్హులకు వెంటనే టిడ్కో ఇళ్లు కేటాయించాలంటూ టీడీపీ, ఇతర ప్రతిపక్ష పార్టీలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. ఈ తరుణంలో సీఎం జగన్ సంచలన ప్రకటన చేశారు. ఈ ఏడాది డిసెంబర్ 25న 300 చదరపు అడుగుల టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు కేవలం ఒక్క రూపాయితో అగ్రిమెంట్‌ ఆఫ్‌ సేల్‌ చేస్తామని ప్రకటించారు. అలాగే హైకోర్టు స్టే ఉన్నచోట్ల మినహా మిగిలిన ప్రాంతాల్లో డిసెంబరు 25న డి-ఫామ్ పట్టాలతో ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు.

టిడ్కో ద్వారా రాష్ట్రంలో 2,62,216 ఇళ్ల నిర్మాణం చేపట్టారని సీఎం జగన్ చెప్పారు. వాటిలో ఇప్పటికే 1,43,600 ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయని, వాటిని 300 చదరపు అడుగుల్లో నిర్మిస్తున్నట్లు వివరించారు. ఇంకా 365 చదరపు అడుగుల్లో 44,300 ఇళ్లు, 430 చదరపు అడుగుల్లో 74,300 ఇళ్ల నిర్మాణం జరుగుతోందని చెప్పారు.

టిడ్కోకు సంబంధించి గత ప్రభుత్వం రూ.3200 కోట్ల బకాయి పెట్టి పోయిందని సీఎం జగన్ పేర్కొన్నారు. ఓ వైపు ఆ బకాయిలు తీరుస్తూనే, మన ప్రభుత్వం వచ్చాక ప్రజల కోసం ఇప్పటికే రూ. 1,200 కోట్లు ఇచ్చామని చెప్పారు. ఈ వారంలో మరో రూ. 400 కోట్లు, ఇంకో రూ. 600 కోట్లు 15 రోజుల్లో ఇస్తామని ప్రకటించారు. టిడ్కో ఇళ్ల మౌలిక వసతుల కోసం రూ.2500 కోట్లు ఖర్చు చేస్తున్నామని, ఆ మేరకు టెండర్లు పిలవబోతున్నట్లు చెప్పారు. డిసెంబరు 15 నాటికి ఆ టెండర్ల ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ ప్రాజెక్టును పూర్తి చేయడం కోసం ప్రభుత్వం చేయబోయే వ్యయం రూ.9,550 కోట్లని, అందుకే వచ్చే మూడేళ్లలో పనులు చేపట్టి పూర్తి చేస్తామని వెల్లడించారు

ఈ నెల23వ తేదీ  నుంచి ఈ నెల 30వ తేదీ వరకు టిడ్కో కింద 300 చదరపు అడుగుల ఇల్లు పొందనున్న లబ్ధిదారుల దగ్గరకు వలంటీర్లు ప్రభుత్వ లెటర్‌ తీసుకువెళతారు. మీకు చంద్రబాబు స్కీమ్‌ కావాలా? జగన్‌ స్కీమ్‌ కావాలా? అని అడుగుతారు. ఏది కావాలో తేల్చుకోమని చెబుతారు. చంద్రబాబు స్కీమ్ లో లబ్ధిదారుడు రూ.3 లక్షల అప్పును నెలకు రూ.3 వేల చొప్పున 20 ఏళ్ల పాటు వడ్డీతో సహా మొత్తం రూ.7 లక్షలు కట్టాలి. ఆ తర్వాతే ఇంటిపై హక్కులు చేతికి వస్తాయి. అప్పుడే ఆ ఇంటి పట్టా లబ్ధిదారులకు అందుతుంది.

జగన్ చెబుతున్న స్కీమ్ లో డిసెంబర్‌ 25న 300 చదరపు అడుగుల టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు కేవలం ఒక్క రూపాయితో అగ్రిమెంట్‌ ఆఫ్‌ సేల్‌ చేస్తారు. ఏ అప్పు లేకుండా వెంటనే సర్వ హక్కులతో ఇల్లు సొంతమవుతుంది. ఆ తర్వాత పక్కాగా ఫ్రీ రిజిస్ట్రేషన్‌ చేస్తారు. మరిన్ని వార్తలు చదవండి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox