Breaking News

ప్రైవేట్ ఆస్పత్రులకు కేజ్రీవాల్ వార్నింగ్..!

06 th Jun 2020, UTC

ప్రైవేట్ ఆస్పత్రులపై ముఖ్యమంత్రి కేజ్రీవాల్ శనివారం తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కొన్ని ఆస్పత్రులు కోవిడ్ -19 రోగులను చేర్చుకోవడానికి నిరాకరిస్తున్నాయని, వారిని ఎంత మాత్రమూ ఉపేక్షించే ఛాన్స్ లేదని ఆయన హెచ్చరించారు. పలుకుబడిని ఉపయోగించి పడకలను బ్లాక్ మార్కెటింగ్ చేయాలని కొందరు ప్రయత్నిస్తున్నారని, వారిని ఎంతమాత్రమూ ఉపేక్షించమని, ప్రభుత్వం నుంచి వారు తప్పించుకోలేరని స్పష్టం చేశారు.

ఆస్పత్రి పడకలు బ్లాక్ మార్కెటింగ్ కాకుండా తాము  ఓ మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తెస్తున్నామని ఆయన ప్రకటించారు. అందులో ఎన్ని పడకలు అందుబాటులో ఉన్నాయి?, ఎన్ని వెంటిలేటర్లు అందుబాటులో ఉన్నాయి? అన్న సమాచారం అందుబాటులో ఉంటుందని, పూర్తి పారదర్శకతతో నిర్వహిస్తామని, కొన్ని రోజులు సమయం కావాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

అతి త్వరలోనే ఆస్పత్రి పడకలు బ్లాక్ మార్కెటింగ్ కాకుండా చూస్తామని, ఆ వ్యాపారాన్ని అంత చేస్తామని, ఆస్పత్రులను ప్రజలకు అందుబాటులోకి తెస్తామని కేజ్రీవాల్ హామీ ఇచ్చారు. కోవిడ్ లక్షణాలున్నట్లు పరీక్షల్లో బయటపడినా సరే... .మరొక ఆస్పత్రికి పంపుతున్నారని లేదా... ప్రవేశాన్ని నిరాకరిస్తున్నారని కొందరు ఫిర్యాదులు చేయడంతో కేజ్రీవాల్ పై విధంగా స్పందించారు.
 
SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox