Breaking News

ఏపీలో 8 జిల్లాల్లో కర్ఫ్యూ సడలింపు

28 th Jun 2021, UTC
ఏపీలో 8 జిల్లాల్లో కర్ఫ్యూ సడలింపు

ఏపీలో 8 జిల్లాల్లో కర్ఫ్యూ ఆంక్షలు సడలించారు. ఉదయం 6 నుంచి రాత్రి 9 వరకు కర్ఫ్యూ సడలిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. జులై 1 నుంచి జులై 7 వరకూ తాజా నిర్ణయాలు వర్తించనున్నాయి.

కొవిడ్‌ పాజిటివిటీ రేటు 5 శాతం కంటే తక్కువ ఉన్న జిల్లాల్లో సడలిస్తున్నట్టు ప్రభుత్వం తన ప్రకటనలో పేర్కొంది. ఏపీలో రాత్రి 9 నుంచి 10 గంటల మధ్య దుకాణాలు, రెస్టారెంట్లు మూసివేయనున్నారు. 8 జిల్లాల్లో రాత్రి 9 నుంచి ఉదయం 6 వరకు కర్ఫ్యూ కొనసాగనుంది.

శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, గుంటూరు, నెల్లూరు, అనంతపురం, కడప, కర్నూలు జిల్లాల్లో ఆంక్షలు సడలించారు. ఇక ఉభయగోదావరి, కృష్ణా, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో మాత్రం యథావిధిగా ఆంక్షలు కొనసాగనున్నాయి. మరిన్ని వార్తలు చదవండి 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox