Breaking News

కశ్మీర్ లో భూములను ఎవరైనా కొనవచ్చు

28 th Oct 2020, UTC
కశ్మీర్ లో భూములను ఎవరైనా కొనవచ్చు

జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370ను గతేడాది ఆగస్టు 5న రద్దుచేసిన కేంద్రం.. తాజాగా మరో కీలక సవరణ చేసింది. కేంద్రం నిర్ణయంతో ఇతర ప్రాంతాలకు చెందిన వ్యక్తలు ఎవరైనా కశ్మీర్‌లో భూములు కొనుగోలు చేయడం, ఇల్లు నిర్మించుకుని శాశ్వతంగా నివసించవచ్చు. జమ్మూకశ్మీర్‌ అభివృద్ధి చట్టం 17వ సెక్షన్‌ లో స్థానికేతరులు భూములు కొనుగోలు చేయకూడదనే కీలక నిబంధనను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సవరించింది. ఈ సవరణలు తక్షణమే అమల్లోకి వస్తాయని మంగళవారం వివరించింది. 

(జమ్మూకశ్మీర్‌ లో ప్రధాన పార్టీల కూటమి)

 వ్యవసాయ భూములను, వ్యవసాయేతరులకు అమ్మేందుకు ఈ సవరణ అంగీకరించలేదని లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా చెప్పారు.వ్యవసాయ భూమిని సాగుచేసే వారు మాత్రమే కొనుగోలు చేయాలని ఆయన తెలిపారు. అయితే, విద్య, వైద్య సంస్థల ఏర్పాటుకు సంబంధించి మినహాయింపులు ఇచ్చింది. వ్యవసాయ భూములను సాగు చేయనివారు సైతం కొనుగోలు చేయవచ్చని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా కేంద్రం నిర్ణయంపై జమ్మూ కశ్మీర్‌లోని పార్టీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. (చైనా దాడికి కారణం ఆర్టికల్ 370ని రద్దు చేయడమే ఫరూఖ్ అబ్దుల్లా)

మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తీవ్రంగా మండిపడ్డారు. కశ్మీర్‌ను అమ్మకానికి పెట్టారని, దీని వల్ల పేదలు నష్టపోతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు, ఇది నిరంకుశ నిర్ణయంగా అభివర్ణించారు. ‘భూముల కొనుగోలుకు సంబంధించి ఆమోదయోగ్యంకాని సవరణలు చేశారు. దీనివల్ల వ్యవసాయేతర భూముల కొనుగోలు, వ్యవసాయ భూముల బదిలీ సులభంగా జరిగిపోతుంది. కశ్మీర్‌ అమ్మకానికి సిద్ధంగా ఉంది. దీని వల్ల పేదలు తీవ్రంగా నష్టపోతారు’ అని ఒమర్‌ అబ్దుల్లా ట్వీట్‌ చేశారు.(హవ్వ ట్విట్టర్.. జమ్మూకాశ్మిర్ చైనాదా..?)

కశ్మీర్‌ను దోచుకోడానికి రాజ్యాగ విరుద్ధంగా ఆర్టికల్‌ 370ని రద్దు చేసిన కేంద్రం.. ఇప్పుడు కశ్మీర్‌ను అమ్మేసేందుకు తాజా సవరణలు చేసిందని పీడీపీ నేత మెహబూబా ముఫ్తీ మండిపడ్డారు. ఇలాంటి నిరంకుశ నిర్ణయాలకు వ్యతిరేకంగా పోరాడేందుకు జమ్ము, కశ్మీర్‌, లడఖ్‌ వాసులంతా ఒక్కటవ్వాలని ఆమె పిలుపునిచ్చారు.  మరిన్ని జాతీయ వార్తలు చదవండి

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox