Breaking News

రవాణా శాఖలో మరో 6 ఆన్‌లైన్‌ సేవలు... రవాణా మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌

03 rd Sep 2020, UTC

హైదరాబాద్ :రవాణా శాఖలో మరో 6 ఆన్‌లైన్‌ సేవలను అందుబాటులోకి తెచ్చినట్లు రవాణా మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ వెల్లడించారు. ఇది వరకే 5 సేవలను అందుబాటులోకి తెచ్చామని, తాజాగా మరో 6 సేవలను ప్రారంభించామని, దీంతో మొత్తం 11 ఆన్‌లైన్‌ సేవలు అందుబాటులోకి వచ్చినట్లయిందని పేర్కొన్నారు. డ్రైవింగ్‌ లైసెన్స్‌ పునరుద్ధరణ(రెన్యువల్‌), డ్రైవింగ్‌ లైసెన్స్‌లో చిరునామా మార్పు, ప్రమాదాల సంబంధిత లైసెన్స్‌ను ఆమోదించడం, గడువు ముగిసిన లెర్నర్‌ లైసెన్స్‌ స్థానంలో కొత్త లెర్నర్‌ లైసెన్స్‌ జారీ, ద్విచక్ర వాహన లైసెన్సును ఫోర్‌ వీలర్‌ డ్రైవింగ్‌ లైసెన్సుగా అప్‌గ్రేడ్‌ చేసుకోవడం, గడువు ముగిసిన డ్రైవింగ్‌ లైసెన్స్‌ కోసం లెర్నర్‌ లైసెన్స్‌ పొందడం వంటి మరో ఆరు కొత్త ఆన్‌లైన్‌ సేవలను ప్రారంభించామని తెలిపారు. కాగా, మరిన్ని ఆన్‌లైన్‌ సేవలను త్వరలోనే అందుబాటులోకి తెస్తామని రవాణా కమిషనర్‌ ఎం.ఆర్‌.ఎం.రావు చెప్పారు. మరిన్ని వార్తలు చదవండి.

Read latest తప్పక చదవాలి | Follow Us on Facebook , Twitter

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox