Breaking News

అమూల్‌ డైరీ ట్విటర్‌ ఖాతా నిలిపివేత..!

07 th Jun 2020, UTC
అమూల్‌ డైరీ ట్విటర్‌ ఖాతా నిలిపివేత..!

ప్రముఖ పాల ఉత్పత్తుల సంస్థ అమూల్‌ డైరీ ఖాతాను మైక్రో బ్లాగింగ్‌ సైట్‌ ట్విటర్ ‌తాత్కలికంగా నిలిపివేసింది. ఇండియా - చైనా మధ్య సరిహద్దు విషయంలో గత కొన్ని రోజులుగా విభేదాలు తలెత్తుతున్న నేపథ్యంలో చైనా ఉత్పత్తులను దేశంలో నిషేధించాలనే ప్రచారం జోరుగా జరుగుతోంది. ఈ క్రమంలోనే భారతీయ ప్రముఖ పాల ఉత్పత్తుల సంస్థ అమూల్‌ డైరీ ‘ఎగ్జిట్‌ ది డ్రాగన్’‌ అంటూ ఒక పోస్టర్‌ను తన ట్విటర్‌ ఖాతలో షేర్‌ చేసింది. ఈ పోస్టర్‌లో అమూల్‌ బేబీ చైనా చిహ్నం డ్రాగన్‌ను చేతితో ఆపుతున్నట్లు ఉంది. అదేవిధంగా ఈ పోస్టర్‌లో చైనా యాప్‌ టిక్‌టాక్‌ కనిపిస్తుండటం ఉండటం విశేషం. దీంతో ట్విటర్‌ అమూల్‌ అకౌంట్‌ను తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ విషయాన్ని అమ్యూల్‌ సంస్థ ధృవీకరించింది.

ఎగ్జిట్‌ డ్రాగన్‌ పోస్ట్‌ కారణంగా తమ ఎకౌంట్‌ను  తాత్కలికంగా తొలగించిందని తెలిపింది. అయితే దీనికి సంబంధించి ట్విటర్‌ తమకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వలేదని అమ్యూల్‌ సంస్థ పేర్కొంది. తాము అన్ని విషయాల మీద స్పందిస్తామని, పక్షపాత ధోరణితో ఏ విషయంలో వ్యవహరించమని అమ్యూల్‌ సంస్థ తెలిపింది. అకౌంట్‌ను తిరిగి పునరుద్దరించాలని ట్విటర్ ను  కోరినట్లు తెలిపింది. తమ అకౌంట్‌ను తొలగించిన కారణంగా ఈ పోస్ట్‌ తమ ఫాలోవర్స్‌ ఎవరికి కనిపించడం లేదని సంస్థ తెలిపింది.

అందరూ అమూల్‌ సంస్థకు అండగా నిలుస్తున్నారని, ట్విటర్‌ ఇలా చేయడంతో వారు అందరూ ఎంతో బాధపడుతున్నారని పేర్కొంది. ఈ విషయంపై ట్విటర్‌ను వివరణ కోరామని కూడా అమూల్‌ సంస్థ తెలిపింది. దీనిపై స్పందించిన ట్విటర్ అమూల్‌ సంస్థ రక్షణ కోసమే ఇలా చేశామని, ట్విటర్లో పబ్లిష్‌ చేసిన విషయంతో దీనికి సంబంధం లేదని తెలిపింది.  

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox