Breaking News

మొత్తం అయిదు అంశాలపై చర్చ జరిగింది.. రామ్ గోపాల్ వర్మ

10 th Jan 2022, UTC

ప్రేక్షకులు వస్తారా లేదా అన్న అంశాన్ని దృష్టిలో పెట్టుకుని సినిమా తీసినవారే టికెట్‌ ధర నిర్ణయిస్తారని దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ అన్నారు. అదే విషయాన్ని తాను ప్రభుత్వానికి స్పష్టం చేసినట్లు వెల్లడించారు. ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానితో ఆయన అమరావతిలో సమావేశం అయ్యారు. ఆ తరవాత మీడియాతో మాట్లాడారు. కేవలం ఇపుడు తాను చెప్పినవి తన అభిప్రాయాలు మాత్రమేనని..దానితో పరిశ్రమ వర్గాలు అంగీకరించవచ్చు లేదా అంగీకరించకపోవచ్చని ఆయన అన్నారు.

మొత్తం అయిదు అంశాలపై తమ మధ్య చర్చ జరిగిందని వర్మ వెల్లడించారు. అందరి అభిప్రాయాలు తీసుకుని అన్ని కోణాల్లో ఆలోచించి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. మంచి నిర్ణయమే వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. థియేటర్ల మూసివేత అంశంపై తమ మధ్య చర్చ జరగలేదన్నారు. మొత్తం మీద చర్చలు సంతృప్తికరంగా జరిగాయని వర్మ అన్నారు.

మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ చట్టం ఎవరికీ చుట్టం కాదన్నారు  సినిమాటోగ్రఫీ చట్టంలోని రూల్స్ ప్రకారం రేటు నిర్ణయించామని స్పష్టం చేశారు. టికెట్ల రేట్లపై ఎవరికైనా సందేహాలుంటే కమిటికి చెప్పాలన్నారు. ఎవరు సూచనలు ఇచ్చినా కమిటి సభ్యులకు ఇవ్వొచ్చన్నారు. ప్రభుత్వం ఎవ్వరినీ ఇబ్బంది పెట్టలేదన్నారు. కొవిడ్ వల్లే పెద్ద సినిమాలు వాయిదా వేసుకున్నారని మంత్రి అభిప్రాయపడ్డారు. సినిమా టికెట్ తగ్గింపుతో నాగార్జునకూ ఇబ్బంది లేదు, నాకూ ఇబ్బంది లేదు, మరి మీకెందుకు ఇబ్బంది అంటూ మంత్రి ఎదురు ప్రశ్న వేశారు. సినిమా పరిశ్రమపై డిస్కస్ చేయడానికి కమిటీ మంగళవారం భేటీ అవుతుందన్నారు. జీవో 35, రేట్లుపై మరోసారి చర్చించేందకు కమిటీని ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. 

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox