Breaking News

కొత్త వైరస్ పై డబ్లూహెచ్ఓ క్లారిటీ..!

03 rd Jul 2020, UTC
కొత్త వైరస్ పై డబ్లూహెచ్ఓ క్లారిటీ..!
చైనా లో మొదలైన కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను స్థంబింప చేసిన సంగతి తెలిసిందే.. ఇప్పటికీ ఈ మహమ్మారి బెడద వదలిలేలా లేదు.. దేశాలకు దేశాలు ఆర్థికం గా నష్టపోయాయి.. అంతర్జాతీయ వాణిజ్య పరిస్థితులన్నీ మారిపోయాయి.. ఆధునిక మానవాళి జీవనమంతా మారిపోయింది. అయితే.. ఒక్క చిన్న వైరస్ ఎంత పని చేసింది అని అందరు ముక్కున వేలేసుకునేలా చేసింది. ఇది ఇలా ఉంటె.. కరోనా మహమ్మారి కాక  మరో వైరస్ చైనా లో వీరంగం సృష్టిస్తోందన్న వార్తలు వస్తున్నాయి.
 
                 ఈ వార్తలపై డబ్లూహెచ్ఓ స్పందించిందని. స్వైన్ ఫ్లూ మాదిరిగా మరో వైరస్ చైనా లో కళ్ళు తెరిచింది అన్న వార్తలు రావడం తో.. ప్రపంచ వ్యాప్తం గా మళ్లి  ఆందోళన మొదలైంది. మరో సంక్షోభం వస్తుందేమోనని  ప్రజల్లో కంగారు మొదలైంది. ఈ నేపధ్యం లో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఓ ప్రకటనను విడుదల చేసింది. కొత్త స్వైన్‌ ఫ్లూ వైరస్‌గా చెబుతున్న ఈ జీ4 వైరస్‌ను 2011 నుంచీ తమ సంస్థ గమనిస్తోందని డబ్ల్యూహెచ్ఓ ప్రకటించింది. 2011 నుంచి 2018 వరకూ ఈ వైరస్‌పై అందుబాటులో ఉన్న సమాచారం విశ్లేషణే తాజా అధ్యయనం. పందుల పెంపకం దారుల్లో ఎంత మంది దీని బారినపడ్డారనే విషయాన్ని కూడా ఆ అధ్యయనం చర్చించిందని  డబ్ల్యూహెచ్ ఓ తెలిపింది. ఇటీవల దీనితాలుకు అధ్యయనం అమెరికన్ జర్నల్ లో పబ్లిష్  అయినా సంగతి తెలిసిందే. ఈ కధనం కూడా సంచలనం సృష్టించింది. 
 
                    అయితే.. చైనా లో కొత్త గా వెలుగుచూస్తోంది అన్న వార్తలు వస్తున్నా నేపధ్యం లో  చైనాలోని జీ4 వైరస్ కొత్తదేంకాదు అని డబ్లూహెచ్ఓ క్లారిటీ ఇచ్చింది.  ఈ కొత్త వైరస్ తాలూకు విశ్లేషణలు అన్ని ఈ అధ్యయనం ఆధారంగా వెలువడ్డాయని  డబ్లూహెచ్ఓ స్పష్టతను ఇచ్చింది. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox