Breaking News

కరుగుతున్న మంచుతో ప్రపంచానికి పెనుముప్పు.. కొత్త వైరస్‌లు పురుడు పోసుకుంటున్నాయా..?

01 st Aug 2020, UTC

ప్రపంచం ప్రస్తుతం గ్లోబల్ వార్మింగ్ వల్ల వచ్చిన సవాళ్లను ఎదుర్కొంటోంది. భూతాపం ధాటికి మంచు ధృవాలు కరిగి నీళ్లలా, సెలయేల్లలా పారుతున్నాయి. కోట్ల సంవత్సరాలుగా ఉన్న మంచు గడ్డలు కరిగి నీరవుతున్నాయి. దీని కారణంగా భవిష్యత్తులో భయంకరమైన వైరస్‌లు ఉత్పన్నం అవుతాయని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా మానవాళి కళ్లు తెరవకుంటే భవిష్యత్తు ఎంతో భయానకంగా మారుతుందని హెచ్చరిస్తున్నారు.
ప్రపంచం ఎదుర్కొంటున్న ముఖ్యమైన విపత్తు భూతాపం. మనిషి స్వార్థం కోసం ప్రకృతిని నాశనం చేస్తుండటంతో భూతాపం పెరిగిపోతోంది. మనిషి చేజేతులా చేసుకుంటున్న పనుల వల్లే,తనకి తానుగా వినాశనాన్ని కొని తెచ్చుకుంటున్నాడు అంటున్నారు శాస్త్రవేత్తలు, నిపుణులు ప్రతి ఏటా ప్రపంచదేశాలు భూతాపాన్ని తగ్గించేందుకు సమావేశాలు జరిపాయే తప్పా,తీసుకున్న చర్యలు చాలా తక్కువే. దీని కారణంగానే కరోనా లాంటి భయంకరమైన వ్యాధులు, వైరస్‌లు పురుడుపోసుకుంటున్నాయన్నది నిపుణుల మాట. నిజానికి ప్రస్తుతం ప్రపంచాన్ని కరోనా అతలాకుతలం చేస్తోంది. రోజురోజుకు మృతుల సంఖ్య, బాధితుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈ మహమ్మారి బారి నుంచి ప్రజలను కాపాడేందుకు వ్యాక్సిన్ తయారుచేసేందుకు శాస్త్రవేత్తలు శ్రమిస్తున్నారు. ఇలాంటి పరిస్ధితుల్లో ఆ మధ్య ఓ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేసి విపరీతంగా భయపెట్టింది. ఇంతకీ ఆ వార్త సారాంశం ఏమిటంటేరాబోయే రోజుల్లో కరోనా కంటే భయంకరమైన వ్యాధి మరొకటి రాబోతోంది అని,ఈ వార్త ఖచ్చితంగా నిజం అని చెప్పలేం కానీ,ఇలా పర్యావరణం కారణంగా ఇప్పటికే చాలా వ్యాధులు పురుడుపోసుకుని ప్రపంచ మానవాళిపై పంజా విప్పాయన్నది మాత్రం నిజం.

నిజానికి 2016వేసవిలో ఐరోపా ఖండాన్ని ఓ హీట్ వేవ్ ఢీకొట్టింది. దీని దెబ్బకు ఉత్తరాన ఆర్కిటిక్‌లో భాగమైన సైబీరియాలో గడ్డకట్టిన మంచు కాస్తా కరిగిపోయింది. దీంతో కొన్నేళ్లుగా అక్కడ మంచులో గడ్డకట్టి ఉన్న బ్యాక్టీరియా ప్రానం పోసుకుంది. దీని కారణంగానే ఆంత్రాక్స్ వ్యాపించింది. 1941లో ఓ రెయిన్‌ డీర్ చనిపోయి దాని కళేబరం మంచులో కూరుకుపోయింది. అయితే భూతాపం పెరగడంతో మంచు కరిగి డీర్ మృతదేహం బయటపడింది. దీనిలో ఉన్న ఆంత్రాక్స్ బ్యాక్టీరియా అక్కడికి చుట్టుపక్కల నీటిపై పొరలో విస్తరించింది. ఆ తర్వాత దాదాపు 2వేల రెయిన్ డీర్లకు ఆంత్రాక్స్ వ్యాపించింది. ఆ తర్వాత సంచార జీవులుగా ఉన్న నెనెట్స్ జాతి ప్రజలకూ బ్యాక్టీరియా వ్యాపించింది. ఇప్పుడు కరోనా వైరస్ కూడా గబ్బిలమో, పామో, ఆలుగు లాంటి వన్యప్రాణుల నుంచే మానవాళికి వ్యాపించిందనే అంచనా ఉంది.. ఇవన్నీ కేవలం మానవుడు చేజేతులా చేసుకుంటున్న అనర్థాలే అంటున్నారు నిపుణులు.

కాగా ప్రస్తుతం ఆర్కిటిక్ ప్రాంతంలో భూతాపం కారణంగా రెట్టింపు స్థాయిలో వేడి పెరుగుతోంది. దీంతో అక్కడి గడ్డ కట్టిన మంచు కరిగి వేల ఏళ్లుగా అందులో కూరుకుపోయిన బ్యాక్టీరియా, వైరస్ తిరిగి ప్రాణం పోసుకునే ప్రమాదం వుందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరోనా వైరస్ లాంటి భయంకర వైరస్‌లు దాడి చేస్తే, వాటిని ముందే అడ్డుకునేలా రకరకాల వ్యాక్సిన్‌లు తయారు చేసి పెట్టుకోవాలని నిపుణులు భావిస్తున్నారు.సైబీరియాలో ఆంత్రాక్స్ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 6లక్షల డీర్‌లకు ఏటా ఆంత్రాక్స్ రాకుండా వ్యాక్సిన్ ఇస్తూనే ఉన్నారు. నిద్రావస్థలో వున్న వైరస్‌లు నిద్ర నుంచి లేవకూడదంటే మనిషి భూతాపాన్ని తగ్గించే చర్యలు చేపట్టాలని పర్యావరణ వేత్తలు హితవు పలుకుతున్నారు.

ఇక భూతాపం ధాటికి మంచు ధృవాలు కరిగి నీళ్లలా, సెలయేల్లలా పారుతున్నాయి. నిజానికి ఉత్తర ధృవం అంటే అది కేవలం మంచు కొండలా మాత్రమే ఉంటుందని మనకు తెలుసు. కానీ గ్లోబల్‌ వార్మింగ్‌కు సంబంధించిన ప్రమాదకరమైన సంకేతాలు ఇప్పుడు ఎలా ధ్వనిస్తున్నాయంటే,ఉత్తరధృవం వ్యాప్తంగా ఉండవలసిన మంచు గడ్డలు కరిగి అదే ప్రాంతంలో సరస్సుల్లాగా దర్శనమిస్తున్నాయి. గ్లోబల్‌ వార్మింగ్‌ వలన పొంచి ఉన్న ప్రమాదానికి ఇది సంకేతం అని. ఇది యావత్ ప్రపంచానికి హెచ్చరిక అని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. గడిచిన అర్ధశతాబ్దంగా ఉత్తర, దక్షిణధృవాల్లో వాతావరణం మారిపోతుంది. ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగిపోతున్నాయి. భూమిపై ఉన్న స్వచ్ఛ జలాల్లో 60శాతం మంచుగడ్డల రూపంలోనే ఉంది. అయితే, ఈ మంచు ఫలకలు వేగంగా కరిగిపోతున్నాయి. ప్రత్యేకించి రెండు ధృవాల్లో ఉన్న హిమానీనదాలు సముద్ర వేడికి తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి. ఏటా వందల కోట్ల టన్నుల మంచుగడ్డలు కరిగిపోయి,సముద్రంలో కలిసిపోతున్నాయని అంచనా.

మంచు ఫలకలు పగిలిపోయి, కరిగిపోయి సముద్రంలో కలిసిపోతే తీర ప్రాంతాల్లోని నగరాలు కనీవినీ ఎరుగని బీభత్స పరిస్థితిని ఎదుర్కొనాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. కోట్ల మంది ప్రజలు సముద్ర తీరాన్ని వదిలిప్రధానభూభాగంలోకి వలస పోవాల్సి ఉంటుందని చెబుతున్నారు పర్యావరణవేత్తలు. మంచుగడ్డలు కరుగకుండా నిరోధిస్తున్న రాస్ ఐస్ షెల్ఫ్‌పై కొలంబియా శాస్త్రవేత్తలు ఈ ధృవాల్లో వేసవికాలాల్లో పరిశోధన జరిపారు. అయితే, ఇది రానున్న కొద్ది దశాబ్దాల్లో కుప్పకూలిపోతుందన్నది విశ్లేషకుల అంచనా. ఉత్తర, దక్షిణ ధృవాల్లో కోట్ల సంవత్సరాల నుంచి మంచుగడ్డలు పేరుకుని ఉన్నాయి. అక్కడ కురిసే మంచు పలుచటి పొరలుగా మారి క్రమంగా భారీ మంచుగడ్డలుగా రూపొంది, కొండలు, పర్వతాలను కప్పేస్తాయి. అక్కడ మంచు పొర దాదాపు మూడు కిలోమీటర్లకుపైగా మందంతో ఉంటుంది. ఇది మొత్తం కరిగిపోతే మొత్తం భూమిపై 160అడుగుల ఎత్తున నీరు అవరిస్తుంది. భూగర్భంలో లభించే శిలాజ ఇంధన వనరులు మొత్తాన్నీ ఉపయోగించేస్తే వచ్చే వేడి, కాలుష్యంతో ఈ మంచు పలకలు కరిగిపోవడం ఖాయం. వాస్తవానికి 25వేల సంవత్సరాల క్రితం నుంచే హిమానీనదాలు కరుగుతూ వస్తున్నాయి. అయితే అది స్వాభావిక ప్రక్రియ. ప్రస్తుతం జరుగుతున్నది మాత్రం దీనికి భిన్నమైన విధ్వంసం.

శీతాకాలంలో ఉత్తర ధృవం వద్ద ఉష్ణోగ్రతలు పెరగడం పట్ల శాస్త్రవేత్తలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని రీతిలో ఆర్కిటిక్‌ ఖండంలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.  సాధారణంగా ఈ సమయంలో ఆ ప్రాంతంలో అత్యంత శీతలంగా వుంటుంది. ఏడాదిలో కెల్లా చల్లగా వుండే సమయమిదే. అయితే ఈ ప్రాంతంలో సైతం అసాధారణమైన పరిణామాలు సంభవించడం శాస్ర్తవేత్తలను విస్మయానికి గురి చేస్తోంది. తుపాను కారణంగా గ్రీన్‌ల్యాండ్‌ సముద్రం మీదుగా వేడి గాలులు రావడంతో మంచు కరిగే స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉత్తర ధృవం వద్ద 20డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు పెరిగి వుండవచ్చునని అమెరికా గ్లోబల్‌ ఫోర్‌కాస్ట్‌ సిస్టమ్‌ తెలిపింది. వాస్తవానికి ఆ ప్రాంతంలో ఉష్ణోగ్రతలను నమోదు చేయడానికి నేరుగా ఎలాంటి పద్ధతులు లేవు. సాధారణం కన్నా 30డిగ్రీల సెల్సియస్‌కి పైగా వుండవచ్చునని విశ్లేషణల ద్వారా తెలుస్తోంది. డానిష్‌ వాతావరణ సంస్థ 1958నుండి సేకరిస్తున్న డేటాను పరిశీలిస్తే ఇది చాలా ఎక్కువట. ఒకప్పుడు అరుదుగా వుండే ఇటువంటి వేడిగాలులు ఇప్పుడు చాలా సర్వసాధారణమవుతున్నాయని పరిశోధనల్లో తేటతెల్లమవుతుంది.

ఇక.. మన దేశంలో సైతం హిమానీ నదాలు వేగంగా కరిగిపోతుండటంతో, ఇన్నాళ్లూ  వాటి కింద ఉండిపోయిన మృతదేహాలు సైతం తాజాగా బయట పడడం సంచలనం కలిగించింది.. గ్లోబల్ వార్మింగ్ కారణంగా ఎవరెస్టుపై ఉన్న హిమానీనదాలు, మంచు ఫలకాలు వేగంగా కరిగిపోతుండడం పట్ల సర్వత్రా తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతోంది.హిమాలయాల్లోని అత్యధిక ప్రాంతాల్లో మాదిరే ఎవరెస్టు ప్రాంతంలోనూ హిమానీ నదాలు వేగంగా కరిగిపోతున్నాయని, మందం తగ్గి పలుచబడిపోతున్నాయని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఖుంబూ హిమానీనదంపై ఉన్న మడుగులు పెద్దవవుతున్నాయని, ఒక దానితో మరొకటి కలిసి పోతున్నాయని, అక్కడ మంచు వేగంగా కరిగిపోతుండటమే దీనికి కారణమని  అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఇక ఎవరెస్టు పర్వతానికి సమీపంలో ఇమ్జా సరస్సు ఉంటుంది. సరస్సులో నీరు ప్రమాదకర స్థాయికి చేరడంతో 2016లో నేపాల్ సైన్యం నీటిని తోడేసింది. హిమానీ నదాలు వేగంగా కరగడం వల్లే అందులో నీరు ప్రమాదకర స్థాయికి చేరిందంటున్నాయి అధ్యయనాలు.

మంచుపలకలు కరిగిపోవటం వల్ల లోపల బంధించబడి ఉన్న శక్తి పెల్లుబుకుతుందని,ఫలితంగా భవిష్యత్‌లో అత్యధిక భూకంప తీవ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు తాజా అధ్యయనాల్లో తేలింది. ఈ నివేదికల ప్రకారం మంచు పలకలు కరిగిపోతుండటం వల్ల భూగర్భంలో ఏర్పడే ఒత్తిడికి భూకంప తీవ్రత ఎక్కువగా ఉంటుందని తెలుస్తోంది. సుమారు 10వేల ఏళ్ల క్రితం స్కాండినేవియాలో భారీ స్థాయిలో వరుస భూకంపాలు ఏర్పడినట్లు ఆ తాజా అధ్యయనాలు తెలుపుతున్నాయి. అదే సమయంలో ఉత్తర స్కాండినేవియాలోని మంచు పలకలు కరగడం ద్వారా ఈ వరుస భూకంపాలు తీవ్రత అధికమైనట్లు వెల్లడైంది.. అప్పట్నుంచి ఈ మంచు పలకలు కరుగుతూ వస్తున్నాయని. దాని కారణంగా భూగర్భ కేంద్రంలో ఒత్తిడి ఏర్పడి తద్వారా పెను భూకంపాలకు దారి తీసే అవకాశం ఉన్నట్లు శాస్త్రవేత్తలు తమ అధ్యయనంలో వెల్లడైందంటున్నారు.

నిజానికి భూకంపాలు రాకుండా నిరోధించే శక్తిని మంచుపలకలు కలగి ఉన్నాయన్న విషయం తాము జరిపిన అధ్యయనాల్లో తేలిందంటున్నారు శాస్త్రవేత్తలు. అత్యంత మందంగా ఉన్న ఈ మంచుపలకలు భూగర్భంలోని పెనుత్పాతాన్ని నిరోధించగలవని,అయితే ఇవి క్రమంగా కరిగిపోతూ వస్తున్నాయని,దీంతో భూకంప తీవ్రత పెరిగే అవకాశం ఉన్నట్లు శాస్త్త్రవేత్తలు చెబుతున్నారు.గ్రీన్‌లాండ్, అంటార్కిటికాల్లో ఈ మంచు మరింతగా కరుగుతోందని దీని కారణంగా భవిష్యత్తులో భూకంపాలు, సునామీల తీవ్రత అధికంగా పెరిగే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు చదవండి. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox