Breaking News

వీఆర్వో వ్యవస్థ రద్దు..? తెలంగాణ సర్కార్ ఆదేశాలు..!

07 th Sep 2020, UTC

హైదరాబాద్ :తెలంగాణలో  వీఆర్వో వ్యవస్థను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాలనీ సీఎం కేసిఆర్ ఎప్పటి నుంచో భావిస్తున్న సంగతి తెలిసిందే. రెవెన్యూ శాఖలో భారీగా లంచాలు తీసుకుంటున్నారనే ఆరోపణలు ఎప్పటి నుంచో ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవల కొందరు అధికారులు కోట్ల రూపాయలను లంచంగా తీసుకుంటూ పట్టుబడటం చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

వీఆర్వో వ్యవస్థ రద్దు చేస్తూ కేసిఆర్ సర్కార్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు కలెక్టర్లకు ఆదేశాలు జారీ అయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే వీఆర్వో వ్యవస్థ తాలూకు రికార్డులను స్వాధీనం చేసుకోవాలి అని కలెక్టర్‌లకు సీఎస్‌ ఆదేశాలు జారీ చేశారు. ఈరోజు మధ్యాహ్నం మూడు గంటల కల్లా రికార్డులను స్వాధీనం చేసుకుని, ఐదు గంటలకల్లా రిపోర్ట్ లు పంపాలని ఆదేశాలు జారీ చేశారు.

అయితే, ఇప్పటికే తహశీల్దార్ల నుంచి వీఆర్వో లందరికి ఆదేశాలు వచ్చాయని ఉద్యోగ సంఘాల నేతలు తెలిపారు. అయితే, ఈ ఆదేశాలపై తమకు అనుమానాలున్నాయని తెలిపారు. ఈ అనుమానాలను ప్రభుత్వం తీర్చాలని డిమాండ్ చేసారు. ఈ శాఖను రద్దు చేస్తే, ఉద్యోగుల సర్వీస్ మాటేమిటి? వారిని ఏ శాఖలో ఉంచుతారో చెప్పాలని డిమాండ్ చేశారు. మరిన్ని వార్తలు చదవండి.

Read latest తప్పక చదవాలి | Follow Us on Facebook , Twitter

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox