హైదరాబాద్ :మునిసిపాలిటీల్లో రెవెన్యూ సంబంధిత సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు
తెలంగాణ మునిసిపల్ శాఖ కార్యాచరణ సిద్ధం చేసింది. వచ్చే నెల 15వ తేదీ వరకూ ప్రతి వారం రెండు రోజుల పాటు రెవెన్యూ మేళాలు నిర్వహించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ప్రతి సోమ, బుధవారాల్లో ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం1.30 గంటల వరకు ఈ మేళాలు నిర్వహించనున్నారు. మునిసిపాలిటీ పరిధిలో ఇల్లు ఉండి, దానికి సంబంధించి ఏదైనా సమస్య ఉంటే వెంటనే పరిష్కరించనున్నారు.
కార్పొరేషన్లు, మునిసిపాలిటీల పరిధిలో ప్రజల సౌకర్యార్థం రెవెన్యూ మేళాలు నిర్వహించాలని మంత్రి
కేటీఆర్ ఇటీవల ఆదేశించారు. ఈ మేరకు ఏర్పాటు చేస్తున్న మేళాల్లో ఆయా విభాగాల అధికారులు అందుబాటులో ఉంటారని మునిసిపల్ శాఖ వెల్లడించింది. ఇదే చివరి అవకాశమని, సమస్యలు ఉన్న వారు వినియోగించుకోవాలని సూచించింది.
ఇంటి పన్ను అసె్సలో నమోదు కాకపోవడం, పన్ను ఎక్కువ రావడం, పన్ను బకాయి ఉండి కట్టనివారు. వన్ టైం సెటిల్మెంట్ కింద వడ్డీపై 90 శాతం మాఫీ పొందడం, అసె్సలో పేరు తప్పుగా నమోదు కావడం, డబుల్ అసె్‌సమెంట్, ఇల్లు రిజిస్ర్టేషన్ చేసుకుని పేరు మార్పిడి చేసుకోకపోవడం వంటి అనేక సమస్యలను ఈ మేళాల్లో పరిష్కరిస్తారు.
మరిన్ని వార్తలు చదవండి.