Breaking News

రాయలసీమ ఎత్తిపోతల పధకం ఏపీ నే సమర్థిస్తున్న కేంద్రం..!

30 th Jul 2020, UTC

రాయల సీమ ఎత్తిపోతల పధకం విషయం ఆంధ్ర ప్రదేశ్ కు తెలంగాణ కు మధ్య జల వివాదం మొదలైన సంగతి తెలిసిందే. అయితే కృష్ణా నదీ జలాల్లో తమ వాటాగా దక్కిన నీటిని ఎత్తిపోత పధకం కింద రాయలసీమ, నెల్లూరు జిల్లావాసులకు తాగునీటి అవసరాలు, సాగు కష్టాలు తీర్చాలని జగన్ సర్కార్ భావిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంలో ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య భిన్నాభిప్రాయాలు తలెత్తగా ఏపీకి వచ్చే వాటా లోనే వినియోగించుకుంటామని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఇది వరకే స్పష్టం చేసింది.

           అయితే తెలంగాణలోని పాత మహబూబ్‌నగర్‌ జిల్లాలకు చెందిన ఓ వ్యక్తి దీనిపై అభ్యంతరం లేవనెత్తాడు. పర్యావరణ అనుమతులు లేకుండా చేపట్టిన ఈ ఎత్తిపోతల పధకం పనులు నిలిపేయాలని ఎన్జీటీలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను ఎన్జీటీ మే 20న విచారించింది. అయితే ఈ పధకం పనులు ప్రస్తుతానికి నిలిపివేయాలంటూ స్టే ఇచ్చింది. ఆ తరువాత ఏపీ ప్రభుత్వం ఎన్జీటీ లో రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది. ఏపీ కి వచ్చే వాటా లోనే జలాలను వినియోగించుకునే క్రమంలోనే ఈ పధకం పనులు చేపట్టామని తెలిపింది.

            కాగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వవాదన ను కేంద్రం సమర్ధిస్తోంది. ఈ పథకం పనులకు పర్యావరణ అనుమతి అవసరం లేదని కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ తేల్చిచెప్పింది. నీటి ఎత్తిపోతల పధకం పర్యావరణంపై ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపదని స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్రం ఓ నివేదిక ను జాతీయ హరిత న్యాయస్థానం (ఎన్జీటీ) దక్షిణ ప్రాంత బెంచ్‌(చెన్నై)కి అందించింది. రాయలసీమ ఎత్తిపోతలపై ఆగష్టు 11న  ఎన్జీటీ తుది విచారణ జరపబోతోంది. ఈ విచారణ లో కేంద్రం ఇచ్చిన నివేదిక కీలక పాత్ర పోషించనుంది.. ఇక పై ఈ పధకానికి గ్రీన్ సిగ్నల్ వచ్చే అవకాశం ఉందని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం భావిస్తోంది. మరిన్ని వార్తలు చదవండి 

Read latest తప్పక చదవాలి | Follow Us on Facebook , Twitter

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox