Breaking News

బార్క్ రేటింగ్స్ లో మొదటి స్దానం రామాయణ్ దే

15 th Aug 2020, UTC

ముంబై :33 ఏళ్ల కిందట దూరదర్శన్‌లో ప్రసారమైన రామాయణం, మహాభారతం సీరియళ్లు టెలివిజన్‌ చరిత్రలో చరిత్ర సృష్టించాయి. అంతటి విశేష ప్రజాదరణ పొందిన ఈ సీరియళ్లు కరోనా వైరస్ లాక్‌డౌన్ నేపథ్యంలో మరోసారి బుల్లితెరపై రావడం మరల రికార్డు స్దాయిలో వీక్షకులు చూడటం తెలిసిందే. తాజాగా బ్రాడ్‌ కాస్ట్‌ ఆడియన్స్‌ రీసెర్చ్‌ కౌన్సిల్‌ (బార్క్‌) అందించిన నివేదిక ప్రకారం టెలివిజన్‌లో ఎక్కువ మంది తిలకించే కార్యక్రమాల్లో రామాయణం మొదటి స్థానంలో నిలిచి రికార్డు సృష్టించింది.
 
ఆగస్టు 1 నుంచి 31 వరకు భారతీయ ప్రేక్షకులు టీవీల్లో ఏయే కార్యక్రమాలను ఎక్కువగా వీక్షించారనే దానిపై బార్క్ ఒక నివేదిక విడుదల చేసింది. దీని ఆధారంగా టీఆర్‌పీల పరంగా రామాయణం ఇప్పటికీ టాప్‌ రేటింగ్‌లో దూసుకుపోతుందని పేర్కొంది. జీ టీవీలో వస్తున్న శ్రద్ధా ఆర్య, ధీరజ్‌ ధూపర్‌ నటించిన కుండలి భాగ్య సీరియల్‌  రెండో స్థానంలో ఉంది. అలాగే మహిమా శానిదేవ్‌ కీ మూడవ స్థానంలో కొనసాగుతంది. దూరదర్శలో ప్రసారమవుతోన్న శ్రీ కృష్ణ నాలుగో స్థానం, స్టార్‌ ప్లస్‌లో ప్లే అవుతున్న అనుపమా అయిదో స్థానం దక్కించుకున్నాయి.
 
బార్క్ వెల్లడించిన వివరాల ప్రకారం ప్రస్తుతం కరోనా వైరస్‌ వ్యాప్తితో సతమతమవుతున్న జనాలు  కామెడీ వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.  ది కపిల్‌ షో, తారక్ మెహతా కా ఓల్తా చాష్మా వంటి కామెడీ  షోలను కూడ ఎక్కువగా చూస్తున్నట్లు  తెలుస్తోంది. మరిన్ని వార్తలు చదవండి.
 
Read latest తప్పక చదవాలి | Follow Us on Facebook , Twitter

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox