Breaking News

నల్లా బిల్లులు కట్టనివారికి వన్ టైం సెటిల్ మెంట్

11 th Aug 2020, UTC

హైదరాబాద్ : జలమండలి బిల్లు బకాయిదారులకు సువర్ణావకాశం కల్పించామని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌  వెల్లడించారు.  పెండింగ్‌లో ఉన్న నల్లా బిల్లుల బకాయిలపై వడ్డీ మాఫీ చేస్తున్నామని కేవలం అసలు మాత్రమే చెల్లిస్తే సరిపోతుందని తెలిపారు. 
 
 మంగళవారం ఆయన ప్రగతిభవన్‌లో జలమండలి వన్‌ టైం సెటిల్‌మెంట్‌ పథకం కరపత్రాలు, బ్యానర్లు, పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ నెల ఒకటి నుంచి సెప్టెంబర్ 15 వరకు 45 రోజుల పాటు అమలులో ఉంటుందన్నారు. 
 
జలమండలి సిబ్బంది ప్రతి ఒక్కరు కష్టపడి పెండింగ్‌లో ఉన్న బిల్లులను వసూలు చేసి బోర్డు ఆదాయం పెంచాలని కేటీఆర్ సూచించారు. అలాగే నగరవాసులకు నామమాత్రం రూసుములతో మంచినీటిని సరఫరా చేస్తున్న జలమండలికి క్రమం తప్పకుండా బిల్లులు చెల్లించి ప్రభుత్వానికి సహకరించే బాధ్యత ప్రజలపై ఉందని కేటీఆర్ అన్నారు. మరిన్ని వార్తలు చదవండి.

Read latest తప్పక చదవాలి | Follow Us on Facebook , Twitter

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox