Breaking News

సవ్యసాచి మిశ్రా రీల్.. రియల్ హీరో

06 th Sep 2020, UTC
సవ్యసాచి మిశ్రా రీల్.. రియల్ హీరో
 
ఒడిశా :నటుడు సోనూసూద్‌ లాక్ డౌన్ సమయంలో వలస కార్మికులను ఆదుకునేందుకు ఎంతలా సాయం చేసాడో అందరికీ తెలిసిన విషయమే. లాక్ డౌన్ ఎత్తేసాక కూడ దేశంలోని పలు ప్రాంతాలనుంచి పలువరు సోనూని సాయం అడగడం, దానికి అతను స్పందించి సాయం చేయడం జరుగుతూనే వుంది. రీల్ విలన్, రియల్ హీరో  అంటూ సోనూసూద్ ని అందరూ పొగడుతున్న విషయం తెలిసిందే. ఇపుడు సోనూసూద్ బాటలోనే మరో నటుడు కూడా లాక్‌డౌన్‌లో పేదలకు ఎంతో సాయం చేస్తూ రియల్‌ హీరో అనిపించుకున్నాడు. ఒడిశాకు చెందిన సవ్యసాచి మిశ్రా సినీ హీరో.
 
అతని తండ్రి ఐఏఎస్‌ ఆఫీసర్‌. లాక్‌డౌన్లో ఇతర రాష్ట్రాలతో పాటూ దుబాయ్‌లో చిక్కుకున్న వందలమందిని సవ్యసాచి సొంత ఖర్చుతో ఒడిశా చేర్చాడు. అతనికి ‘స్మైల్‌ ప్లీజ్‌’ అనే స్వచ్ఛంద సంస్థ ఉంది. ఆ సంస్థ ద్వారానే తన సేవా కార్యక్రమాలను చేపట్టాడు. లాక్‌డౌన్‌ సమయంలో రాజస్థాన్లో చిక్కుకుపోయిన ఓ విద్యార్థి సోషల్‌ మీడియా ద్వారా సవ్యసాచి సాయం కోరాడు. రాజస్థాన్‌లో చిక్కుకున్న ఒడిశా విద్యార్థులనే కాదు, తెలంగాణ, ఉత్తరాఖండ్‌, తమిళనాడు, కేరళ, గుజరాత్‌లలో నిలిచిపోయిన ఒడిశా విద్యార్థులందరినీ ప్రత్యేక బస్సులో సొంత రాష్ట్రానికి చేర్చాడు. ఇక అప్పట్నించి సాయం చేయమంటూ అతనికి వినతులు రావడం మొదలయ్యాయి.
 
గుంటూరు జిల్లా బాపట్లలో ఓ ఒడిశా యువతి యజమాని చెరలో చిక్కుకుంది. లాక్‌డౌన్‌లో ఇంటికి వెళ్లే దారి లేక అక్కడే చిత్రహింసలు భరించింది. ఒడిశాలో ఉన్న ఆమె తల్లి కూతురి పరిస్థితి సవ్యసాచికి చెప్పడంతో అతను పోలీసులు, మరికొందరు మంచి మనుషుల సాయంతో ఆ అమ్మాయికి విముక్తి కల్పించారు. మరోసారి దుబాయ్‌లో చనిపోయిన ఒడిశా వాసి పార్థివదేహంతో పాటూ, అక్కడున్న మరో 189 మందిని ప్రత్యేక విమానం ద్వారా రాష్ట్రానికి చేర్చారు. కరోనా కారణంగా ఆగిపోయిన పెళ్లిళ్లను జరిపించారు. పేదలకు ఆహార వసతి కల్పించారు. అందుకే సవ్యసాచి మిశ్రా సినిమాల్లోనే కాదు, నిజజీవితంలో కూడా హీరో అనిపించుకున్నాడు. మరిన్ని వార్తలు చదవండి.

Read latest తప్పక చదవాలి | Follow Us on Facebook , Twitter

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox