Breaking News

ముంబయ్ కు పొంచివున్న నిసర్గ్ ముప్పు..!

02 nd Jun 2020, UTC
ముంబయ్  కు  పొంచివున్న నిసర్గ్ ముప్పు..!

ఇప్పటికే కరోనా కోరల్లో చిక్కుకుని విలవిలలాడుతున్న ముంబయ్ నగరాన్ని ముంచెత్తేందుకు... ‘నిసర్గ’ తుఫాన్ దూసుకొస్తోంది. ఆగ్నేయ అరేబియా సముద్రంలో ఆదివారం ఏర్పడిన అల్పపీడనం.. సోమవారం వాయుగుండంగా బలపడింది.

మరి కాసేపటికి... తుఫాన్‌గా బలపడి తీరం వైపు కదులుతోంది. నిసర్గగా పిలుస్తున్న ఈ తుఫాన్.,. ప్రస్తుతం గోవాలోని పనాజీకి నైరుతి దిశగా 280 కి.మీ, ముంబయికి దక్షణ నైరుతి దిశగా 450 కి.మీ దూరంలో, గుజరాత్‌లోని సూరత్‌కు దక్షణ నైరుతి దిశలో 670 కి.మీ దూరంలో కేంద్రీకృతమైనట్టు మంగళవారం ఉదయం విడుదల చేసిన బులెటిన్‌లో వాతావరణవిభాగం పేర్కొంది.

ఈ తుపాను రేపు మధ్యాహ్నానికి దక్షిణ గుజరాత్‌, ఉత్తర మహారాష్ట్ర తీరాలను దాటుతుందని తెలిపింది. డామన్, హరిహరేశ్వర్ (మహారాష్ట్ర) మధ్య తీరం దాటే అవకాశముందని తెలిపింది. నిసర్గ తుఫాన్ ప్రభావం మహారాష్ట్ర, గుజరాత్‌పై ఎక్కువగా ఉంటుందని
ముఖ్యంగా ముంబయ్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడే ప్రమాదముందని హెచ్చరించారు. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox