Breaking News

తెలంగాణ కోర్టుల్లో సెప్టెంబర్ 5 వరకు లాక్ డౌన్..!

11 th Aug 2020, UTC

హైదరాబాద్ : కరోనా మహమ్మారి కారణంగా ఇంకా కొన్ని చోట్ల లాక్ డౌన్ కొనసాగుతున్న సంగతి విదితమే. దుకాణాలకు బయట తిరగడానికి ప్రభుత్వం నిర్దేశిత మార్గదర్శకాలతో అనుసమతులు ఇచ్చినప్పటికీ. చాలా ఆఫీస్ లు ప్రారంభం కాలేదు. వర్క్ ఫ్రమ్ ఆప్షన్ తో విధులు నిర్వర్తించాల్సిందిగా కంపెనీలు ఆదేశిస్తున్నాయి. అయితే కరోనా ఉద్ధృతి తగ్గకపోవడంతో కోర్టుల్లో కూడా లాక్ డౌన్ కొనసాగిస్తున్నట్లు హై కోర్ట్ ప్రకటించింది.
                ఈ నేపధ్యంలో రాష్ట్రంలోని అన్ని కోర్టులు, ట్రిబ్యునల్‌లకు లాక్‌డౌన్‌ను సెప్టెంబర్‌ 5 వరకు పొడిగిస్తున్నట్టు హైకోర్టు ప్రకటించింది. అత్యవసర కేసులు విచారణను వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కొనసాగించాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఆన్ లైన్ లోనే కాకుండా.. నేరుగా కోర్టుల్లో పిటిషన్‌లు దాఖలు చేసేందుకు అవకాశం ఉందని తాజాగా విడుదల చేసిన ఉత్తర్వుల్లో హై కోర్ట్ పేర్కొంది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలు మినహా ఇతర జిల్లాలలోని కోర్టుల్లో నేరుగా పిటిషన్లు దాఖలు చేసుకోవచ్చని హైకోర్టు తెలిపింది. శానిటైజేషన్, మాస్కులు, సోషల్ డిస్టెన్స్  వంటి కరోనా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించింది. మరిన్ని వార్తలు చదవండి.

Read latest తప్పక చదవాలి | Follow Us on Facebook , Twitter

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox