Breaking News

నేటి నుంచి శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల అమ్మకం...

24 th Aug 2020, UTC

ఆంధ్రప్రదేశ్ :తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లనుతిరిగి అందుబాటులోకి తీసుకొచ్చింది. భక్తుల సౌకర్యార్థం 2020 సెప్టెంబ‌ర్ నెల‌కు సంబంధించిన రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను ఆగ‌స్టు 24వ తేదీన‌ ఉదయం 11.00 గంటలకు టీటీడీ విడుదల చేయ‌నుంది. దీనికి సంబంధించి ఐటీ అధికారులు చర్యలు చేపట్టారు. టీటీడీ వెబ్‌సైట్, స్థానికంగా ఉన్న ఆన్‌లైన్ పోర్టల్స్ ద్వారా శ్రీవారి దర్శనానికి అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవచ్చన్నారు. గతంలో లాక్ డౌన్  నేపధ్యంలో వీటిని రద్దు చేసిన విషయం తెలిసిందే.

అయితే సెప్టెంబ‌ర్ 15న శ్రీ‌వారి ఆల‌యంలో కోయిల్ ఆళ్వారు తిరుమంజ‌నం, సెప్టెంబ‌రు 18 నుంచి 27 వ‌ర‌కు శ్రీవారి న‌వాహ్నిక వార్షిక బ్రహ్మోత్సవాలు ఉన్న నేపథ్యంలో ఆ రోజుల్లో రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన‌ము టికెట్లను టీటీడీ ర‌ద్దు చేసింది. భక్తులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఆన్‌లైన్‌లో ముందస్తుగా రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను బుక్‌ చేసుకోవాలని టీటీడీ ఓ ప్రకటనలో కోరింది.
 
టీటీడీలో కరోనా వైరస్ కేసులు భారీగా పెరుగుతున్నప్పటికీ  భక్తులను అనుమతించడంపై విమర్శలు వస్తున్నాయి. అయినా  తాజాగా, రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనాలను ప్రారంభించడం గమనార్హం. మరిన్ని భక్తి వార్తలు చదవండి.
 
SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox