Breaking News

అమిత్ షా అపాయింట్ మెంట్ రద్దవడం వల్లనే ...!

02 nd Jun 2020, UTC

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన రద్దు అయిన సంగతి తెలిసిందే.కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా అపాయింట్‌మెంట్ రద్దు కారణంగానే  జగన్‌ పర్యటన వాయిదా పడిందని తెలుస్తోంది. ప్రస్తుతం అమిత్ షా నిసర్గ తుపాను ముందస్తు కార్యక్రమాల్లో  బిజీబిజీగాగా ఉన్నారు.

 అధికారులతో సమాలోచనలు జరపడం, రాష్ట్రాల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకోవడంలో బిజీగా వున్నందున ఈ రోజు అపాయింట్ మెంట్ రద్దు చేస్తున్నట్లు కేంద్ర హోం శాఖ చెప్పింది. అయితే తుపాను తర్వాత మళ్లీ అపాయింట్‌మెంట్ ఇస్తామని   ఏపీ సీఎంవోకు సమాచారం వచ్చినట్లు తెలుస్తోంది.

. ఇవాళ మధ్యాహ్నం రెండు గంటలకు జగన్ ఢిల్లీ వెళ్లాల్సి ఉంది. అయితో మరో రెండు మూడు గంటల్లో ఢిల్లీకి బయల్దేరాల్సి ఉండగా సడన్‌గా ఆ పర్యటన రద్దు అయ్యింది. ఇవాళ ఢిల్లీకి జగన్ వెళ్లుంటే.. మొదట కేంద్ర మంత్రి అమిత్ షాతో.. ఆ తర్వాత పలువురు కేంద్ర మంత్రులు, కీలక అధికారులతో భేటీ కావాల్సి ఉంది. ఈ భేటీల్లో భాగంగా రాష్ట్రానికి సాయం అందించాల్సిందిగా అభ్యర్థిస్తారని, కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్న విభజన సమస్యలను పరిష్కరించాల్సిందిగా కోరతారని అధికార వర్గాలు ముందే మీడియాకు వెల్లడించాయి

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox