Breaking News

ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం ఇద్దరు పైలట్లు సహా 20మంది మృతి

08 th Aug 2020, UTC

కేరళ :దుబాయ్‌ నుంచి వచ్చిన ఎయిర్ ఇండియా విమానం కోజికోడ్‌ విమానాశ్రయంలో ల్యాండింగ్‌ అవుతున్న క్రమంలో అదుపుతప్పి ఒక్కసారిగా పక్కకు దూసుకెళ్లింది. దీంతో విమానం రెండుగా విరిగిపోయింది. ముందు భాగం పూర్తిగా ధ్వంసమవడంతో ఇద్దరు పైలట్లతో సహా 17మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో 125 మందికి పైగా క్షతగాత్రులు కాగా, వారిలో 20 మంది పరిస్థితి విషమంగా ఉంది. 20అంబులెన్స్‌లు ఘటనాస్థలం వద్దకు చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించాయి. కేరళ సీఎం పినరయ్ విజయన్ ఆదేశాల మేరకు పోలీసు,అగ్నిమాపక, వైద్య బృందాలు సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. 
 
వందే భారత్ మిషన్‌లో భాగంగా ఎయిరిండియా విమానం ప్రయాణికులను తీసుకొస్తుండగా శుక్రవారం రాత్రి 7.45కు ఈ ప్రమాదం సంభవించింది. భారీ వర్షం కారణంగానే ప్రమాదం జరిగిందని డీజీసీఏ ప్రకటించింది.ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేరళ ముఖ్యమంత్రి విజయన్‌తో మాట్లాడారు. అన్ని విధాలా సాయమందిస్తామని చెప్పారు. అటు అమిత్ షా కూడా ఘటనా స్థలానికి సహాయక బృందాలను వెంటనే పంపామంటూ ట్వీట్ చేశారు. విమాన ప్రమాదంపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ట్విట్ట‌ర్ ద్వారా స్పందించారు. కోజికోడ్‌లో జ‌రిగిన‌ ఎయిర్ ఇండియా  విమాన ప్ర‌మాద ఘ‌ట‌న విచార‌క‌ర‌మ‌న్నారు. ప్రమాదం గురించి తెలిసి బాధ‌కు గురైన‌ట్లు తెలిపారు. ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలు సంఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని త‌క్ష‌ణ‌మే స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టాల్సిందిగా అమిత్‌ షా ఆదేశించారు. 
 
ఈ ఘటనలో మరణించిన, గాయపడిన ప్రయాణీకులు, సిబ్బంది వివరాలకై షార్జా, దుబాయ్‌ల్లో సహాయ కేంద్రాలను ఏర్పాటు చేశారు. +971565463903, +9715430 90572, +971543090575 హెల్ప్‌లైన్లు ప్రారంభించారు. అదే విధంగా కేరళలోని బాధితుల కుటుంబ సభ్యుల కోసం 0495–2376901 హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేసినట్లు కోళీకోడ్‌ కలెక్టర్‌ తెలిపారు.
 
ల్యాండింగ్‌ సమయంలో దుబాయ్-కోళీకోడ్ విమానం పూర్తి వేగంతో ఉందని, రన్‌వేను ఓవర్‌షాట్ చేసిందని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) తెలిపింది. ల్యాండింగ్‌కు రెండు సార్లు ప్రయత్నించడం, కాస్త ఎక్కువ వేగంతో ల్యాండ్‌ అవ్వడం వల్లే ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. మరిన్ని వార్తలు చదవండి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox