Breaking News

పండగ సందడి..అందుబాటులోకి 900 ప్రత్యేక రైళ్లు..!

19 th Oct 2020, UTC

హైదరాబాద్ :దసరా పండుగ సందర్భంగా తొమ్మిది వందల ప్రత్యేక రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో రాకేష్‌ ఓ ప్రకటనలో తెలిపారు. కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపధ్యంలో రిజర్వేషన్ ఉంటె తప్ప రైల్వే స్టేషన్ లోకి అనుమతి లేదని దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో రాకేష్‌ స్పష్టం చేసారు. అలాగే స్టేషన్ లోకి ప్రవేశించే ప్రతి ప్రయాణికుడికి శానిటైజేషన్, థర్మల్ స్క్రీనింగ్ చేసిన తరువాతే లోనికి అనుమతిస్తున్నామని తెలిపారు.

కరోనా నేపధ్యంలో మార్చి 23 నుంచి ట్రైన్స్ రద్దు అయినా సంగతి తెలిసిందే. ఆ తరువాత రైల్వేను అందుబాటులోకి తీసుకొచ్చినా పూర్తి స్థాయిలో పునరుద్దరించలేదు. తాజాగా దసరా పండగ సీజన్ సందర్భంగా తొమ్మిది వందల రైళ్లను అందుబాటులోకి తీస్తున్నారు. అయితే తప్పని సరిగా ముందుగా టికెట్ ను బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. రైల్వే స్టేషన్లలో కూడా బుకింగ్ సదుపాయానికి అనుమతి ఇచ్చారు. రిజర్వేషన్ ప్రకారమే లోపలకి అనుమతిస్తామని రాకేష్ స్పష్టం చేశారు. ఏసీ బోగీల్లో ప్రయాణికులకు దుప్పట్లు ఇవ్వడం లేదని ఆయన స్పష్టం చేసారు. అలాగే భోజన ఏర్పాట్లు కూడా ప్రయాణికులు ఇంటినుంచి ఏర్పాటు చేసుకుంటే మంచిదని ఆయన సూచన చేసారు. క్యాటరింగ్‌ ఫుడ్‌ కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నామని తెలిపారు. ప్రయాణికులు తప్పనిసరిగా కరోనా నిబంధనలను పాటించాలని అన్నారు. మరిన్ని వార్తలు చదవండి.

Read latest తప్పక చదవాలి | Follow Us on Facebook , Twitter

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox