Breaking News

కువైట్ నుంచి 8 లక్షలమంది భారతీయులు వెనక్కి?

07 th Jul 2020, UTC

కువైట్ లోఉన్న విదేశీ కార్మికుల సంఖ్యను తగ్గించాలని కోరుతూ పెట్టిన ప్రవాసీ కోటా డ్రాఫ్ట్‌ బిల్లుకు జాతీయ అసెంబ్లీ కమిటీ ఆమోదం తెలిపింది. ఈ బిల్లు ప్రకారం దేశ  జనాభాలో ఇతరులు 15 శాతానికి మించకూడదు. గల్ఫ్‌లో ఉన్న విదేశీయుల జనాభాలో  భారతీయులే అత్యధికంగా ఉన్నారు. ప్రస్తుతం కువైట్‌ జనాభాలో 4.3 మిలియన్లు అయితే అందులో కువైట్‌ జనాభా 1.3 మిలియన్లు ఉండగా ప్రవాసులే 3 మిలియన్లు ఉన్నారు. అందువలనదాదాపు 8 లక్షల మంది భారతీయులను కువైట్ నుంచి తిరిగి స్వదేశానికి వెళ్లిపోవలసి వుంటుంది.

కరోనా వైరస్‌ కారణంగా అక్కడి ప్రధాన వ్యాపారమైన చమురు ధరల క్షీణించడంతో కువైట్‌లో ఉన్న విదేశీయుల సంఖ్యను తగ్గించాలని చట్టసభ సభ్యులు, ప్రభుత్వ అధికారులు పిలుపునివ్వడంతో దీనికి అధిక మద్దతు లభించింది. గత నెలలో కువైట్ ప్రధాన మంత్రి షేక్ సబా అల్ ఖలీద్ అల్ సబా విదేశియుల జనాభాను 70 శాతం నుంచి 30 శాతానికి తగ్గించాలని ప్రతిపాదించినట్లు ఓ పత్రిక వెల్లడించింది.

 కువైట్‌లో ప్రవాసీయుల సం‍ఖ్యను క్రమంగా తగ్గించాలని కోరుతూ సమగ్ర ముసాయిదా బిల్లు చట్టాన్ని తాను శాసనసభ్యుల బృందంతో కలిసి అసెంబ్లీకి సమర్పించనున్నట్లు అసెంబ్లీ స్పీకర్ మార్జౌక్ అల్-ఘనేమ్ కువైట్ పేర్కొన్నారు. ఈ బిల్లులో తాము వైద్యులను, నైపుణ్యం కలిగిన మానవశక్తిని మాత్రమే నియమించుకుంటామని, నైపుణ్యం లేని కార్మికులను తిరిగి పంపించేయాలని నిర్ణయించామని పేర్కొన్నారు

. కువైట్లోని భారత రాయబార కార్యాలయం ప్రకారం.. ప్రభుత్వానికి నర్సులు, జాతీయ చమురు కంపెనీలలో వివిధ విభాగాల్లో ఇంజనీర్లు, శాస్త్రవేత్తలుగా పనిచేస్తున్నవారు సుమారు 28 వేల మంది  ఉన్నారు.  మెజారిటీ భారతీయులు 5.23 లక్షల మంది ప్రైవేటు రంగాల్లో పనిచేస్తున్నారు. అదనంగా, సుమారు 1.16 లక్షల మంది డిపెండెంట్లు ఉన్నారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox