Breaking News

కరోనా ను జయించిన 105 ఏళ్ల బామ్మ

30 th Jul 2020, UTC
కరోనా ను జయించిన 105 ఏళ్ల బామ్మ

కేర‌ళ :దేశంలో క‌రోనా వైర‌స్ విజృంభిస్తోన్న వేళ ఆ మ‌హ‌మ్మారి నుంచి కోలుకుంటున్న వారి  సంఖ్య కూడా పెరుగుతోంది. తాజాగా క‌రోనా వైర‌స్ ‌తో మూడు నెల‌లపాటు పోరాడిన‌ కేర‌ళ‌కు చెందిన 105ఏళ్ల బామ్మ బుధ‌వారం సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జి అయి ఇంటికి వెళ్లిన విష‌యాన్ని కేర‌ళ ఆరోగ్య ‌శాఖ స్వ‌యంగా వెల్ల‌డించింది.

కొల్లామ్ జిల్లాలోని ఆంచ‌ల్ ప‌ట్ట‌ణానికి చెందిన 105ఏళ్ల ఆస్మా బీవీ ఏప్రిల్ 20న క‌రోనా బారిన ప‌డ్డారు. ఆమెకు త‌న కూతురు ద్వారా వైర‌స్ సంక్ర‌మించిన‌ట్లు తెలిసింది. కుటుంబ‌స‌భ్యులు ఆస్మా బీవీని చికిత్స కోసం కొల్లామ్ మెడిక‌ల్ ఆసుప‌త్రిలో చేర్పించారు. అయితే వ‌య‌సు రిత్యా వైర‌స్ దాటికి త‌ట్టుకుంటుందా అన్న అనుమానం అక్క‌డి వైద్యుల‌కు క‌లిగింది. అయితే  దాదాపు మూడు నెల‌ల పాటు క‌రోనాతో పోరాడి సంపూర్ణ ఆరోగ్యంతో ఇంటికి వెళ్లారు. 

ఆస్మా విజ‌యంతంగా క‌రోనా నుంచి బ‌య‌ట‌ప‌డ‌డంతో వైర‌స్ మ‌హ‌మ్మారి నుంచి కోలుకున్న అతి పెద్ద వ‌య‌స్కురాలిగా చ‌రిత్ర సృష్టించిన‌ట్లు వైద్యాధికారులు తెలిపారు. చికిత్స స‌మ‌యంలో కొన్ని ఆరోగ్య స‌మ‌స్య‌లు చ‌ట్టుముట్టినా ఆమె త‌న ఆత్మ‌స్థైర్యం కోల్పోకుండా క‌రోనాతో దైర్యంగా పోరాడింద‌ని వెల్ల‌డించారు. ఆమె ఆరోగ్య స్థితిని ప‌ర్య‌వేక్షించేందుకు ఒక మెడిక‌ల్ బోర్డును కూడా ఏర్పాటు చేసిన‌ట్లు తెలిపారు.

ఇప్ప‌టివ‌ర‌కు కేర‌ళ‌కు చెందిన 93ఏళ్ల థామ‌స్ అబ్ర‌హం క‌రోనా నుంచి కోలుకున్న అతిపెద్ద వ‌య‌స్కుడిగా నిలిచారు. కానీ ఇప్పుడు అదే కేర‌ళ‌కు చెందిన ఆస్మా బీవీ వైర‌స్ నుంచి కోలుకొని దేశంలోనే అతిపెద్ద వ‌య‌స్కురాలిగా నిలిచారు. ఈ విష‌యం తెలుసుకున్న కేర‌ళ ఆరోగ్య శాఖ మంత్రి కెకె శైల‌జ క‌రోనాను జ‌యించిన‌ ఆస్మా బీవీని ప్ర‌శంసించారు. త‌న‌కు వైర‌స్ సోకింద‌ని తెలిసినా అంత పెద్ద వ‌య‌సులోనూ త‌న ఆత్మ‌స్థైర్యాన్ని కోల్పోలేదంటూ మెచ్చుకున్నారు.

కేర‌ళ‌లో కొత్త‌గా 903క‌రోనా కేసులు న‌మోద‌వ్వ‌గా మొత్తం కేసుల సంఖ్య 21,797గా ఉంది. కాగా మ‌ర‌ణాల సంఖ్య 68కి చేరింది. మరిన్ని వార్తలు చదవండి. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox