Last Updated:

Ganta Srinivasarao: మెగాస్టార్ చిరంజీవితో ’గంటా‘ భేటీ

హైద‌రాబాద్ లో మెగాస్టార్ చిరంజీవితో భేటీ అయ్యారు టీడీపీ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాస‌రావు. ఈ భేటీలో తాజా రాజ‌కీయాల‌ పై చ‌ర్చించిన‌ట్లు స‌మాచారం.

Ganta Srinivasarao: మెగాస్టార్ చిరంజీవితో ’గంటా‘ భేటీ

Hyderabad: హైద‌రాబాద్ లో మెగాస్టార్ చిరంజీవితో భేటీ అయ్యారు టీడీపీ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాస‌రావు. ఈ భేటీలో తాజా రాజ‌కీయాల‌ పై చ‌ర్చించిన‌ట్లు స‌మాచారం. చిరంజీవి తాజా వ్యాఖ్య‌ల నేపథ్యంలో వారి భేటీ ప్రాధాన్య‌త‌ని సంత‌రించుకుంది. కాగా గాడ్ ఫాద‌ర్ మూవీ స‌క్సెస్ సాధించ‌డంతో చిరంజీవిని అభినందించేందుకే తాను క‌లిశాన‌ని చెబుతున్నారు గంటా.

గంటా శ్రీనువాసురావు 1999లో రాజకీయాల్లో ప్రవేశించి టీడీపీ నుంచి అనకాపల్లి ఎంపీగా గెలిచారు. తరువాత 2004 లో చోడవరం ఎమ్మెల్యేగా గెలిచారు. 2009లో ప్రజారాజ్యం తరపున పోటీచేసి అనకాపల్లి ఎమ్మెల్యేగా గెలిచారు. మరలా 2014లో టీడీపీలో చేరి భీమిలి ఎమ్మెల్యేగా గెలిచారు. 2019లో విశాఖ ఉత్తర నియోజక వర్గంనుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఎన్ని సార్లు పార్టీలు మారినా ఆయన తాను పోటీ చేసిన సెగ్మెంట్ నుంచి గెలుపొందడం విశేషం.

ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడంతో గంటాకు మంత్రి పదవి దక్కింది. తరువాత 2014 నుంచి 2019 వరకూ చంద్రబాబు క్యాబినెట్లో మంత్రిగా పనిచేసారు. అయితే 2019 లో టీడీపీ ఓడిపోవడంతో వైసీపీలో చేరడానికి సిద్దమయ్యారు. కాని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అడ్డుకోవడంతో ఆయన ప్రయత్నాలు విఫలమయ్యాయి. గంటా చాలకాలం నుంచి టీడీపీ కార్యక్రమాల్లో యాక్టివ్ గా పాల్గొనడం లేదు.

ఇవి కూడా చదవండి: