Etala Rajender-Jitender Reddy meeting: ఫాం హౌజ్‌లో ఈటల రాజేందర్- జితేందర్ రెడ్డి భేటీ

మహబూబ్ నగర్ మాజీ ఎంపి, బీజేపీ నేత జితేందర్ రెడ్డితో హుజూరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ భేటీ ముగిసింది. జితేందర్ రెడ్డి ఫాం హౌజ్‌లో 20 నిమిషాలపాటు ఇద్దరు నేతలు సమావేశమయ్యారు. హర్యానా గవర్నర్ దత్తాత్రేయకూడా లంచ్ మీటింగ్‌లో పాల్గొన్నారు.

  • Written By:
  • Publish Date - July 3, 2023 / 05:21 PM IST

Etala Rajender-Jitender Reddy meeting: మహబూబ్ నగర్ మాజీ ఎంపి, బీజేపీ నేత జితేందర్ రెడ్డితో హుజూరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ భేటీ ముగిసింది. జితేందర్ రెడ్డి ఫాం హౌజ్‌లో 20 నిమిషాలపాటు ఇద్దరు నేతలు సమావేశమయ్యారు. హర్యానా గవర్నర్ దత్తాత్రేయకూడా లంచ్ మీటింగ్‌లో పాల్గొన్నారు. ఫాం హౌజ్‌కి వచ్చిన ఈటలకి జితేందర్ రెడ్డి కుమారుడు మిథున్ రెడ్డి శాలువా కప్పి స్వాగతం పలికారు. ఈ లంచ్ మీటింగులో ఈ ఇద్దరు నేతలు ఏం మాట్లాడుకుంటారన్నదానిపై ఆసక్తి నెలకొంది. హుజూరాబాద్ ఉప ఎన్నికలకి జితేందర్ రెడ్డి ఇంచార్జిగా వ్యవహరించారు. మొన్న బండి నాయకత్వాన్ని ప్రశ్నించే వారికి దున్నపోతుల ట్రీట్మెంట్ అవసరమంటూ జితేందర్ రెడ్డి ట్వీట్ చేశారు. వయసు పెరిగిన కొద్దీ జాగ్రత్తగా మాట్లాడాలని ఈటల రాజేందర్ సూచించారు. ఇద్దరి మధ్య సంధి కుదిరినట్లేనని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ఈటలతో ఎటువంటి విబేధాలు లేవు..( Etala Rajender-Jitender Reddy meeting)

ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌తో తనకు ఎలాంటి విబేధాలు లేవని బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి స్పష్టం చేశారు. ఈటలకు కీలక పదవి ఇస్తే స్వాగతిస్తానని తెలిపారు. జితేందర్ రెడ్డి ఫాం హౌజ్‌లో బీజేపీ నేతలు సమావేశమయ్యారు. ఈటల సహా పార్టీ నేతలందరం కలుసుకుంటూనే ఉంటామని జితేందర్ రెడ్డి తెలిపారు. బీజేపీ అధ్యక్షుడి మార్పుపై తనకు సమాచారం లేదన్నారు. బీజేపీ అధ్యక్షుడి రేసులో తాను లేనని  పార్టీ ఇచ్చిన బాధ్యతను నిర్వర్తిస్తానని చెప్పారు. తన ట్వీట్‌కు వివరణ ఇవ్వనని ఎలా అర్థం చేసుకుంటారో చేసుకోండని జితేందర్ రెడ్డి అన్నారు.