Site icon Prime9

Rajinikanth: రజినీకాంత్ చంద్రబాబుని కలవడానికి రీజన్ అదే..

rajinikanth meeting chandrababu nadiu makes hot news in telugu states

rajinikanth meeting chandrababu nadiu makes hot news in telugu states

Rajinikanth : సూపర్ స్టార్ రజనీకాంత్‌ టీడీపీ అధినేత, చంద్రబాబుని కలిసిన విషయం అందరికీ తెలిసిందే. హైదరాబాద్‌లోని తన నివాసానికి వచ్చిన రజినీకాంత్ ను చంద్రబాబు సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఇరువురు యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత పలు అంశాలపై చర్చించినట్లు సమాచారం అందుతుంది. ఆ తర్వాత రజినీకాంత్ ను, చంద్రబాబు శాలువా కప్పి సన్మానించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో… తమ భేటీకి సంబంధించిన ఫొటోను చంద్రబాబు ట్విట్టర్ లో షేర్‌ చేశారు. ప్రస్తుతం ఆ ఫోటో నెట్టింట ఫుల్ గా చక్కర్లు కొడుతుంది.

అలానే “నా ప్రియమైన స్నేహితుడు తలైవా రజనీకాంత్‌ను కలిసి, ముచ్చటించడం చాలా ఆనందంగా ఉంది అని చంద్రబాబు ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. సుమారు 40 నిమిషాల పాటు చంద్రబాబు, రజనీ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలు వారిద్దరి మధ్య చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. రాజకీయాల గురించి మాట్లాడుకున్నట్లు సమాచారం. అలాగే వీరు భేటీ కావడం సినీ, రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. దీని పట్ల నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. సోమవారం రోజు పవన్‌ కళ్యాణ్ తో భేటీ అయిన చంద్రబాబు… ఇప్పుడు రజనీకాంత్‌తో సమావేశం కావడం హాట్ టాపిక్ అవుతుంది.

చంద్రబాబును రజినీకాంత్ కు దక్షిణాది రాష్ట్రాలలో ఉన్న ఫాలోయింగ్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.

రజనీకాంత్‌ రాజకీయ ప్రవేశం సుమారు పాతికేళ్లుగా నలుగుతున్న విషయం.

ఆయన రాజకీయాల్లోకి వస్తారా? లేదా? అనే విషయమై 1996వ ఏడాది నుంచి చర్చ జరుగుతుండగా.. మూడేళ్ల క్రితం రజనీ ఆ ఉత్కంఠకు తెరదించారు.

ప్రకటన చేసినా క్రియాశీలక రాజకీయాలకు కూడా దూరంగానే ఉన్నారు.

దీంతో ఆయన రాజకీయ అరంగేట్రం రాష్ట్ర రాజకీయాల్లో చర్చలకే పరిమితమైంది.

అయితే గతంలో తాను రాజకీయాల్లోకి వస్తున్నట్టు ప్రకటించిన రజినీకాంత్.. కొద్ది రోజుల్లో పార్టీ పేరును వెల్లడిస్తానని తెలిపారు.

ఆ తర్వాత ఇప్పట్లో పార్టీ పెట్టే యోచనలేదని, ఆరోగ్య కారణాల దృష్ట్యా ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు పేర్కొన్నారు.

కలవడానికి కారణం అదేనా ..?

ప్రస్తుతం రజనీకాంత్ బీజేపీకి ఇండైరెక్ట్ గా మద్దతు ఇస్తున్నారని తమిళనాట వార్తలు వినిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని తెదేపా – బీజేపీ మళ్ళీ కలవనున్నాయా అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.  అయితే ఇది సాధారణ భేటీ అని.. హైదరాబాద్ లో సినిమా షూటింగ్ కోసం వచ్చిన రజనీకాంత్ మర్యాద పూర్వకంగానే చంద్రబాబును కలిశారు తప్ప ఇందులో ఎలాంటి రాజకీయ చర్చలు లేవని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి పవన్, రజనీ వరుసగా చంద్రబాబుని కలవడం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ బాజ్ ని క్రియేట్ చేసిందని చెప్పాలి.

ఇవి కూడా చదవండి…

Ttd: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. అదేంటో తెలుసా?

Samantha: ఓపిక లేకపోయినా వచ్చాను.. కన్నీరు పెట్టుకున్న సమంత

Hyderabad: తెలంగాణలో ఈ నెల 19న మోదీ పర్యటన.. రాష్ట్రంలో పరుగులు పెట్టనున్న వందేభారత్ రైలు

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/@Prime9News
https://www.youtube.com/Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: http://Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

 

 

Exit mobile version
Skip to toolbar