Site icon Prime9

Chandrababu: జగన్ ఒక్క అవకాశమని సర్వనాశనం చేశారు.. సీఎం చంద్రబాబు

AP Assembly Budget Session: గత ఎన్నికల్లో జగన్ ఒక్క అవకాశమని వచ్చి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని సీఎం చంద్రబాబు అన్నారు. అసెంబ్లీలో బడ్జెట్‌పై ఆయన ప్రసంగించారు. గత ఐదేళ్లల్లో తాము ఊహించిన దాని కంటే ఎక్కువ విధ్వంసం జరిగిందన్నారు. వైసీపీ ప్రభుత్వం కనీసం జీఓలు కూడా ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచలేదన్నారు. గత ప్రభుత్వ హయాంలో కాగ్‌కు కూడా నివేదికల అందించలేదని వెల్లడించారు.

రాష్ట్ర విభజన కంటే ఎక్కువ నష్టం జరిగిందని చంద్రబాబు విమర్శలు చేశారు. జగన్ చీకటి పాలనలో రాష్ట్రంలో 30 ఏళ్లు వెనక్కి వెళ్లిపోయిందని చంద్రబాబు అన్నారు. భూమికి డిమాండ్ ఉన్నందునే హైదరాబాద్ అభివృద్ధి చెందిందన్నారు. ఇందులో భాగంగానే అమరావతి కోసం భారీగా భూమి కావాలనుకున్నామని వివరించారు.

Exit mobile version
Skip to toolbar