Last Updated:

Raisins: కడుపులో మంటకు “కిస్మిస్” తో చెక్

కిస్మిస్ అంటే ఇష్టపడని వాళ్లెవరు చెప్పండి. ఎండుద్రాక్షల ప్రయోజనం పొందాలంటే వాటిని నానబెట్టి తీసుకుంటే మంచిదని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. ఎందుకంటే నానబెట్టిన ఎండుద్రాక్షలో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్​ను ఎక్కువ స్థాయిలో ఉంటాయి. ఇవి మన ఆరోగ్యాన్ని మెరుగుపరిచే అనేక పోషకాలతో నిండి ఉంటాయి కాబట్టి ఎవరైనా వీటిని తీసుకోవచ్చు.

Raisins: కడుపులో మంటకు “కిస్మిస్” తో చెక్

Raisins: కిస్మిస్ అంటే ఇష్టపడని వాళ్లెవరు చెప్పండి. వీటిలో పలురకాలు ఉన్నాయిలెండి పలు ప్రాంతాల్లో పలు రకాల పేర్లతో వీటిని పిలుస్తుంటారు. ముద్దు పేరు మాత్రం ముద్దుగా కిస్మిస్. ఇంగ్లీష్ లో రెజిన్స్ అంటారు. ప్రపంచంలోని అత్యంత పోషకాలు కలిగిన డ్రై ఫ్రూట్​లలో ఈ ఎండుద్రాక్ష ఒకటి. అంటారు. వీటిని కొందరు ఇష్టంగానూ మరికొందరు అయిష్టంగా తింటూ ఉంటారు. ఏదైతేనేం వీటిలో ఉండే పోషకాలు తెలిస్తే మాత్రం వదలరు. మరి ఎండుద్రాక్షల ఉపయోగాలేంటో తెలుసుకుందామా..

ఎండుద్రాక్షల ప్రయోజనం పొందాలంటే వాటిని నానబెట్టి తీసుకుంటే మంచిదని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. ఎందుకంటే నానబెట్టిన ఎండుద్రాక్షలో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్​ను ఎక్కువ స్థాయిలో ఉంటాయి. ఇవి మన ఆరోగ్యాన్ని మెరుగుపరిచే అనేక పోషకాలతో నిండి ఉంటాయి కాబట్టి ఎవరైనా వీటిని తీసుకోవచ్చు.

కడుపులో మంట, జీర్ణ సమస్యలు దూరం
కడుపులో యాసిడ్‌ రిఫ్లక్స్​తో సమస్యలు ఉన్నట్లయితే.. ఎండుద్రాక్షను నానబెట్టి.. ఆ నీటితో పాటు తీసుకోవడం ఒక అద్భుతమైన విధానం. ఇవి పేగు పనితీరును మెరుగుపరిచే, గట్ బ్యాక్టీరియాను నియంత్రించే యాంటీ ఇన్ఫ్ల మేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి. కాబట్టి రైసిన్ వాటర్ మీ జీర్ణవ్యవస్థకు అద్భుతమైనది.

రక్తశుద్ధి చేయడంలో
శరీరంలోని టాక్సిన్స్‌ను బయటకు పంపి.. రక్త శుద్ధి చేయడంలో నానబెట్టిన ఎండుద్రాక్షలు, దాని నీరు ముఖ్యపాత్ర పోషిస్తాయి. కనీసం ఒక వారం పాటు ఈ నీటిని తీసుకోవడం వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. అంతేకాకుండా ఇది మీ కాలేయాన్ని శుభ్రపరుస్తుంది. దాని పనితీరును మెరుగుపరుస్తుంది.

రోగనిరోధక శక్తిని మెరుగుపరచడంలో
ఎండుద్రాక్ష నీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మీ రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరచడంలో, అనేక వ్యాధులను నివారించడంలో సహాయపడతాయి. ఇది రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంతోపాటు జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి తోడ్పడుతుంది.

జుట్టు రాలకుండా 
చాలా మంది జుట్టు రాలిపోతుంది అంటూ బాధపడుతూ ఉంటారు. అయితే మీరు ఈ సమస్యను అధిగమించడానికి నానబెట్టిన ఎండుద్రాక్ష, దాని నీటిని రెగ్యూలర్​గా తీసుకుంటే మంచి ఫలితాలు పొందుతారు. ఇవి రక్త ప్రవాహాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. అంతేకాకుండా జుట్టు రాలడాన్ని ఆపడానికి.. హెయిర్ ఫోలికల్స్‌ను మరింత ప్రేరేపిస్తాయి.

నిద్రలేమిని మెరుగుపరుస్తుంది
ఈ రోజుల్లో చాలా మంది నిద్రలేమిని సమస్యతో బాధపడుతున్నారు. ఈ సమయంలో నిద్ర రుగ్మతలను దూరం చేసుకోవడానికి.. నిద్రను ప్రేరేపించే హార్మోన్ మెలటోనిన్‌ను కలిగి ఉన్న ఎండుద్రాక్షను, దాని నీటిని తీసుకోవచ్చు.

ఇదీ చదవండి: మలబద్ధకం, అజీర్ణ సమస్యలకు చెక్ పెట్టే వంటింటి చిట్కాలు

ఇవి కూడా చదవండి: