Last Updated:

Gastric Problem : గ్యాస్ సమస్యలు ఉన్న వారు ఈ టిప్స్ ను ఫాలో అవ్వండి !

Gastric Problem : గ్యాస్ సమస్యలు ఉన్న వారు ఈ టిప్స్ ను ఫాలో అవ్వండి !

Gastric Problem : గ్యాస్ సమస్యలు ఉన్న వారు ఈ టిప్స్ ను ఫాలో అవ్వండి !

Gastric Problem : ఈ మధ్య కాలంలో మనలో చాలామందికి గ్యాస్‌ సమస్యలు ఎక్కువవుతున్నాయి.గ్యాస్‌ సమస్య ఉన్నప్పుడు మనం ఏ పని కూడా పనీచేయలేం,ఒక చోట స్థిమితంగా ఉండలేం,కనీసం సరిగా పడుకోలేం.ఎక్కువ సేపు ఒకేచోట కూర్చుని పని చేయడం,శారీరక వ్యాయామం లేకపోవడం వలన,అసలు నిద్రలేకపోవడం వలన,కొన్ని వ్యాధులకు వాడే మందుల వల్ల జీర్ణాశయంలో,పేగుల్లో కొన్ని సూక్ష్మ జీవుల వల్ల గ్యాస్‌ బాగా ఏర్పడుతుంది.అసల గ్యాస్ సమస్యలు ఎందుకొస్తాయంటే తీవ్రమైన మానసిక ఒత్తిడి,మద్యం ఎక్కువగా తీసుకోవడం వలన, సమయానికి ఆహారం తీసుకోకపోవడం,ఆహారంలో వేపుళ్లు, మసాలాలు,కారం, పులుపు వల్ల గ్యాస్ సమస్యలు వస్తాయి.

సోంపు వాటర్‌

చాలామందికి భోజనం తరువాత సోంపు వాటర్ తాగుతారు.తర్వాత కాస్తంత సోంపును నోట్లో వేసుకునే అలవాటు ఉంటుంది.సోంపు జీర్ణ వ్యవస్థను బాగా మెరుగుపరుస్తుంది.ఇది తింటే..మనం తీసుకున్న మంచిగా ఆహారం చక్కగా జీర్ణం అవుతుంది.సోంపులో యాంటీఆక్సిడెంట్లు,ఏ,సీ,రాగి,కాల్షియం,ఐరన్,జింక్,పొటాషియం,మెగ్నీషియం వంటి మినరల్స్‌ పుష్కలంగా ఉంటాయి.ఒక స్పూన్ సోంపు నీళ్లలో మరిగించి,ఆ తర్వాత వడపోయండి.ఈ నీళ్లు గోరువెచ్చగా తాగితే గ్యాస్‌,మలబద్ధకం లాంటి సమస్యలు తగ్గుతాయి.జీర్ణక్రియ మెరుగుపడుతుంది.

కొబ్బరి నీళ్లు

కొబ్బరి నీళ్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయని అందరికీ తెలుసు.గ్యాస్ట్రిక్‌ సమస్యతో బాధపడే వారికి కొబ్బరి నీళ్లు మంచిగా పని చేస్తాయి. దీన్ని తీసుకోవడం వల్ల గ్యాస్ట్రిక్‌,ఎసిడిటీ లాంటి సమస్యలతో బాధపడేవారు…కొబ్బరి నీళ్లను క్రమం తప్పకుండా రోజూ తీసుకుంటే చాలా మంచిది. కొబ్బరి నీళ్లలో విటమిన్లు, మినరల్స్, ఫైబర్, ప్రొటీన్లు, పుష్కలంగా దొరుకుతాయి.

ఇవి కూడా చదవండి: