Published On:

Fat Loss With One Snack: ఒకే ఒక్క స్నాక్‌తో ఈజీగా ఫ్యాట్‌లాస్

Fat Loss With One Snack: ఒకే ఒక్క స్నాక్‌తో ఈజీగా ఫ్యాట్‌లాస్

Fat Loss With One Snack: ఒకే ఒక్క స్నాక్ తింటే ఆడవారిలో బెల్లీ ఫ్యాట్, అధిక బరువు రెండూ తగ్గించుకోవచ్చు. బరువును తగ్గించుకోవాలని చాలా మంది ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. దాని కోసం ఎంతో కష్టపడుతుంటారు. అలాంటి వారికి ఫ్యాట్ లాస్ కోచ్ పాట్రిక్ హాంగ్ ఒక బెస్ట్ స్నాక్‌ని సజెస్ట్ చేస్తున్నారు. బరువు పెరగాలన్నా, తగ్గించుకోవాలన్నా ముఖ్యంగా ఆహారపు అలవాట్లను మార్చుకోవాలి. మనం తీసుకునే ఆహారాన్ని బట్టే శరీరంలోని ఫ్యాట్ పెరగడం లేదా తగ్గడం జరుగుతుంది. అందుకే సరైన ఆహారం తీసుకోవాలి. మరి ముఖ్యంగా ఆడవారిలో అనేక కారణాలతో ఫ్యాట్ పెరుగుతుంది. దీన్ని కంట్రోల్ చేయడంలో ప్రోటీన్ షేక్ సహాయం చేస్తుంది. ప్రోటీన్‌తో తయారైన ఆహారం, డ్రింక్స్ తీసుకోవాలి. అది హెల్దీ అండ్ టెస్టీగా తీసుకోవాలి అంటే ప్రోటీన్ షేక్ బెస్ట్ అని చెబుతున్నారు.

ప్రోటీన్ షేక్‌తో పాటు ఫ్యాట్‌ని కరిగించే ముఖ్యమైన స్నాక్‌ని షేర్ చేసుకుంటున్నారు. వీటిని తీసుకోవడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా బరువును తగ్గించుకోవచ్చు. అందులో ముఖ్యమైనవి పండ్లు, డార్క్ చాక్లెట్, గుడ్లు, పీనట్ బటర్, అరటిపండు, పాప్‌కార్న్ వంటివి హెల్దీ ఆప్షన్ ఉన్నపటికీ అన్నింటిలో ప్రోటీన్ షేక్ బెస్ట్ అని కోచ్ పాట్రిక్ చెబుతున్నారు. ముఖ్యంగా ఆడవారిలో సాధారణంగా రోజుకి 50 గ్రాములు మాత్రమే తీసుకుంటున్నారు. ఇది శరీరానికి అస్సలు సరిపోదు. ఒక ప్రోటీన్ షేక్ అనేది 25 గ్రాములు పెంచుతుంది. ఆ అదనపు ప్రోటీన్ బరువు తగ్గడానికి సహాయం చేస్తుంది. ఎక్కువసేపు కడుపు నిండినట్లు ఉంచుతుంది. ఈ షేక్ ఇతర స్నాక్స్ కంటే శరీరానికి ఎంతో హెల్స్ చేస్తుంది.

ఇవి కూడా చదవండి: