Last Updated:

Hyderabad  : హైదరాబాద్ కు ‘వరల్డ్ గ్రీన్ సిటీ అవార్డ్’

ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ పచ్చదనాన్ని అభివృద్ధి చేసినందుకు హైదరాబాద్ నగరం ప్రతిష్టాత్మక AIPH గ్లోబల్ ‘వరల్డ్ గ్రీన్ సిటీ అవార్డ్స్ 2022’ అందుకుంది.

Hyderabad  : హైదరాబాద్ కు ‘వరల్డ్ గ్రీన్ సిటీ అవార్డ్’

Hyderabad: ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ పచ్చదనాన్ని అభివృద్ధి చేసినందుకు హైదరాబాద్ నగరం ప్రతిష్టాత్మక AIPH గ్లోబల్ ‘వరల్డ్ గ్రీన్ సిటీ అవార్డ్స్ 2022’ అందుకుంది.దక్షిణ కొరియాలోని జెజులో జరిగిన ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ హార్టికల్చర్ ప్రొడ్యూసర్స్ 2022 వరల్డ్ గ్రీన్ సిటీ అవార్డ్స్ 2022లో హైదరాబాద్ మొత్తం ‘వరల్డ్ గ్రీన్ సిటీ అవార్డు 2022’ మరియు ‘లివింగ్ గ్రీన్ ఫర్ ఎకనామిక్ రికవరీ అండ్ ఇన్‌క్లూజివ్ గ్రోత్’ విభాగంలో మరొకటి గెలుచుకుంది.

మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ మరియు అర్బన్ డెవలప్‌మెంట్ మంత్రి కెటి రామారావు మొత్తం హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ బృందాన్ని మరియు స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎంఏ అండ్ యుడి అరవింద్ కుమార్‌ను అభినందించారు.నగరానికి ప్రతిష్టాత్మకమైన “ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ హార్టికల్చర్ ప్రొడ్యూసర్స్” అవార్డులు రావడం పట్ల ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు సంతోషం వ్యక్తం చేశారు.

ఈ అంతర్జాతీయ అవార్డులు తెలంగాణ, దేశ ఖ్యాతిని మరింత బలోపేతం చేశాయన్నారు.రాష్ట్ర ప్రభుత్వం హరితహారం, పట్టణాభివృద్ధి కార్యక్రమాలను పటిష్టంగా అమలు చేస్తూ దేశానికి పచ్చని ఫలాలను అందజేస్తోందనడానికి ఈ అంతర్జాతీయ అవార్డులే నిదర్శనమని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.ఈ అంతర్జాతీయ అవార్డులకు భారతదేశం నుండి ఎంపికైన ఏకైక నగరం హైదరాబాద్ కావడం గర్వకారణమని ఆయన అన్నారు.

ఇవి కూడా చదవండి: