Last Updated:

Jaipur: పనివారి ద్రోహం.. మత్తుమందు పెట్టి ఫుల్ గా దోచేశారు

ఏ పని చేయాలన్నా పక్కా ప్లానింగ్ ఉండాలంటారు. దాన్ని నిరూపిస్తూ ఓ దొంగల బ్యాచ్ యజమాని ఇంటిని నిలువునా దోచేశారు. నమ్మకంగా ఉంటూనే పక్కా ప్లాన్ తో కోట్ల రూపాయల నగదు, బంగారంతో ఉడాయించిన ఆ ఘటన రాజస్థాన్ లో చోటుచేసుకొనింది.

Jaipur: పనివారి ద్రోహం.. మత్తుమందు పెట్టి ఫుల్ గా దోచేశారు

Jaipur: ఏ పని చేయాలన్నా పక్కా ప్లానింగ్ ఉండాలంటారు. దాన్ని నిరూపిస్తూ ఓ దొంగల బ్యాచ్ యజమాని ఇంటిని నిలువునా దోచేశారు. నమ్మకంగా ఉంటూనే పక్కా ప్లాన్ తో కోట్ల రూపాయల నగదు, బంగారంతో ఉడాయించిన ఆ ఘటన రాజస్థాన్ లో చోటుచేసుకొనింది.

పోలీసుల సమాచారం మేరకు, జోధ్ పూర్లో అశోక్ చోప్రా అనే దివ్యాంగ వ్యాపారవేత్త నివసిస్తున్నాడు. ఆయనతోపాటు వృద్ధురాలైన తల్లి బాగోగులు చూసుకొనందుకు నాలుగేళ్ల కిందట లక్ష్మీ అనే మహిళ పనిమనిషిగా ఆ ఇంటిలో చేరింది. నమ్మకంగా వ్యహరించింది. దీంతో ఆమె సిఫార్సుతో కొద్ది నెలల కిందట మరో ముగ్గురు పనివాళ్లు ఆ ఇంటిలో పనికి చేరారు.

కోటీశ్వరుడైన వ్యాపారి అశోక్‌ చోప్రా ఇంటిని దోచుకునేందుకు ఆ నలుగురు పనివాళ్లు ప్లాన్‌ వేశారు. రెండు రోజుల క్రితం ఆ కుటుంబం తినే ఆహారంలో మత్తుమందు కలిపారు. చోప్రా తల్లి, ఆమె మనవరాలికి మాత్రం ఆ ఆహారం పెట్టలేదు. మిగతా కుటుంబ సభ్యులంతా ఆ ఆహారం తిని మత్తులోకి వెళ్లారు. అనంతరం పనివాళ్లు అక్కడి సీసీటీవీలను పగులగొట్టారు. ఆ ఇంట్లోని కోట్లాది డబ్బు, నగలు దోచుకున్నారు. ఆ కుటుంబ సభ్యుల మొబైల్‌ ఫోన్లు కూడా తస్కరించారు. బంగ్లా గేట్‌ను రిమోట్‌ కంట్రోల్‌ ద్వారా లాక్‌ చేశారు. వ్యాపారి చోప్రా కారులో అక్కడి నుంచి దర్జాగా పారిపోయారు.

దోపిడీపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. నాగౌర్ జిల్లాలోని కుచమన్ ప్రాంతంలో నిందితులు వదిలేసిన వ్యాపారి కారును గుర్తించారు. ఆ నలుగురు వ్యక్తులు నేపాల్‌కు చెందిన వారని పోలీసులు తెలిపారు. ఢిల్లీ కేంద్రంగా పని చేస్తున్న ఏజెన్సీకి ఇద్దరు వ్యక్తులు తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సమర్పించి ఆ ఇంట్లో ఉద్యోగం పొందినట్లు చెప్పారు. వ్యాపారి అశోక్‌ చోప్రా, ఆయన ఇద్దరు డ్రైవర్లు ఇంకా మత్తు నుంచి కోలుకోలేదని, సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

ఇది కూడా చదవండి: Jubilee Hills Pubs: నిబంధనలు అతిక్రమణ.. జూబ్లీహిల్స్ లో రెండు పబ్బుల పై కేసులు

ఇవి కూడా చదవండి: