Site icon Prime9

Wine Shops open: మందుబాబులకు గుడ్ న్యూస్.. ఇక అర్ధరాత్రి కూడా!

Wine Shops opened till mid night: మద్యంబాబులకు ఏపీ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త చెప్పనుంది. నేడు, రేపు అర్ధరాత్రి వరకు మద్యం అమ్మేందుకు ఎక్సైజ్ శాఖ నిర్ణయంచగా.. ప్రభుత్వం ఇవాళ ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే ఎక్సైజ్ శాఖ వైన్స్, బార్లు, క్లబ్‌లు, ఈవెంట్లకు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై నేడు ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

ఒకవేళ ప్రభుత్వం అనుమతికి గ్రీన్ సిగ్నల్ ఇస్తే.. రాత్రి 10 గంటల వరకు మాత్రమే తెరిచి ఉండే వైన్స్ దుకాణాలు అర్ధరాత్రి 1 గంట వరకు ఓపెన్ ఉండనున్నాయి. అయితే ఈ రెండు రోజులు మద్యం భారీగా అమ్ముడుపోయే అవకాశం ఉంది. దీంతో రాష్ట్ర ఎక్సైజ్ శాఖకు అధిక మొత్తంలో ఆదాయం రానుంది. కాగా, అనుమతి ఇవ్వకుంటే బెల్ట్ షాపుల దోపిడీ చేసే అవకాశం ఉన్నందున.. అర్ధరాత్రి ఒంటి గంట వరకు వైన్స్ దుకాణాలు ఓపెన్ చేసేందుకు అనుమతి ఇస్తే కొంత అరికట్టవచ్చని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా అక్రమంగా మద్యం విక్రయించకుండా ఎక్సైజ్ శాఖ ముందస్తు చర్యలు చేపట్టింది. డిసెంబర్ 31 నుంచి జనవరి 1 వరకు ఎలాంటి అవాంతరాలు జరగకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే సరిహద్దుల్లో చెక్ పోస్టులు, బోర్డర్ మొబైల్ పెట్రోలింగ్ వంటి నిర్వహించేందుకు అధికారులను అప్రమత్తం చేశారు.

ఇదిలా ఉండగా, విజయవాడలో న్యూ ఇయర్ వేడుకలపై పోలీసులు ఆంక్షలు విధించారు. అర్ధరాత్రి రోడ్డుపై వేడుకలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ముఖ్యంగా బెంజ్ సర్కిల్, కనక దుర్గ ప్లైఓవర్లు బంద్ చేయనుండగా.. బందర్, ఏలూరు, బీఆర్టీఎస్ రోడ్‌లో ఆంక్షలు విధించనున్నారు.

మరోవైపు, రాష్ట్రంలో మద్యం భారీగా అమ్ముడుపోతోంది. గత మూడు నెలల లెక్కల ప్రకారం.. రాష్ట్ర వ్యాప్తంగా ర.6వేల కోట్లకుపైగా మద్యం అమ్ముడుపోయినట్లు ఎక్సైజ్ శాఖ తెలిపింది.ఇక, డిసెంబర్ 31, జనవరి 1వ తేదీన ఈ అమ్మకాలు డబుల్ అయ్యే అవకాశం ఉందని ఎక్సైజ్ శాఖ అంచనా వేస్తోంది.

Exit mobile version