Last Updated:

Hyderabad: భర్త పై వేడినూనె పోసిన భార్య

ప‌రాయి స్త్రీల వ్యామోహంతో తనను నిర్ల‌క్ష్యం చేస్తున్నాడ‌ని ఓ భార్య త‌న భ‌ర్త‌ పై క్ష‌ణికావేశంతో కాగుతున్న వేడి నూనెను పోసింది. దీంతో తీవ్ర గాయాల‌పాలైన భ‌ర్త ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘ‌ట‌న హైద‌రాబ‌ాద్ న‌గ‌రంలో చోటుచేసుకుంది.

Hyderabad: భర్త పై వేడినూనె పోసిన భార్య

Hyderabad: ప‌రాయి స్త్రీల వ్యామోహంతో తనను నిర్ల‌క్ష్యం చేస్తున్నాడ‌ని ఓ భార్య త‌న భ‌ర్త‌ పై క్ష‌ణికావేశంతో కాగుతున్న వేడి నూనెను పోసింది. దీంతో తీవ్ర గాయాల‌పాలైన భ‌ర్త ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘ‌ట‌న హైదరాబాద్ న‌గ‌రంలో చోటుచేసుకుంది.

హైదరాబాద్ లోని దరియాబాగ్‌లో గిరిధర్ లాల్ కుటుంబం గ‌త మూడున్న‌ర సంవ‌త్స‌రాలుగా నివాస‌ముంటోంది. అయితే, న‌గ‌రానికి వ‌చ్చిన త‌ర్వాత త‌న భ‌ర్త ప‌రాయి మ‌హిళ‌ల వ్యామోహంలో ప‌డి త‌మ‌ను నిర్ల‌క్ష్యం చేస్తున్నాడ‌ని భార్య రేణుక తరచూ గొడవపడేది. ఈ క్రమంలో వారిద్దరి మధ్య తరచూ ఘర్షణలు జరిగేవి. ఇదే విధంగా మంగ‌ళ‌వారం నాడు కూడా మ‌రోసారి వివాదం చోటుచేసుకుంది. ఈ క్ర‌మంలోనే రేణుక త‌న భ‌ర్త‌ పై కాగుతున్న నూనెను పోసింది. దీంతో అతని త‌ల‌, చేతులు, ఛాతీ పై తీవ్ర గాయాలు అయ్యాయి.

స్థానికులు పోలీసుల‌కు స‌మాచారం ఇవ్వ‌డంతో అక్క‌డ‌కు చేరుకున్న పోలీసులు, బాధితుడిని స్థానికుల సాయంతో ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ప్ర‌స్తుతం ఉస్మానియా ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నాడు. కేసు న‌మోదుచేసుకున్న పోలీసులు భార్య రేణుకను అదుపులోకి తీసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. పిల్లల చదువులకోసం విజయవాడనుంచి హైదరాబాద్ కు వచ్చినట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి: