Upendra About UI Movie: కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర గురించి పత్యేకంగా పరిచయం అవసరం లేదు. దశాబ్ధాలుగా ఆయన ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్నారు. తెలుగులోనూ ఎన్నో సినిమాలు చేసి ఇక్కడ తనకంటూ ప్రత్యేకమైన మార్క్ క్రియేట్ చేసుకున్నారు. ముఖ్యంగా 90లలో ఆయన సినిమా చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఆయన సినిమాలు రియాలిటీకి చాలా దగ్గర ఉంటాయి. ఇక ఉపేంద్ర స్టార్ హీరో మాత్రమే కాదు డైరెక్టర్ కూడా అనే విషయం తెలిసిందే. తన స్వీయ దర్శకత్వంలో నటించిన సినిమాలేన్నో మంచి విజయం సాధించాయి. అందులో కన్యాదానం, రా, ఎ, ఉపేంద్ర, రక్త కన్నీరు వంటి సినిమాలు బ్లాక్‌బస్టర్‌గా నిలిచాయి.
ఈ సినిమాలతో తెలుగు ఆడియన్స్‌కి ఆయన బాగా దగ్గరయ్యారు. ఆ తర్వాత కొంతకాలానికి టాలీవుడ్‌కు దూరమైన ఆయన ‘సన్నాఫ్ సత్యమూర్తి’ కీలక పాత్ర పోషించి మళ్లీ తెలుగు ఆడియన్స్‌ని పలకరించారు. ఇదిలా ఉంటే ఉపేంద్ర తన సొంత దర్శకత్వానికి గ్యాప్ ఇచ్చిన సంగతి తెలిసిందే. కొంతకాలంగా ఆయన డైరెక్షన్ పక్కన పెట్టి కేవల హీరోగా మాత్రమే సినిమాలు చేస్తున్నారు. గతేడాది కబ్జా సినిమాతో ఆడియన్స్‌ని పలకరించిన ఆయన మెగాఫోన్ పట్టి చాలా ఏళ్లు అయ్యింది. దీంతో ఆయన అభిమానులంతా ఉపేంద్ర దర్శకత్వం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ క్రమంలో లాంగ్ గ్యాప్ తర్వాత ఉపేంద్ర మరోసారి మెగాఫోన్ పట్టారు. తాజాగా ఆయన స్వీయ దర్శకత్వంలో ‘యూఐ’ సినిమా చేశారు. శుక్రవారం (డిసెంబర్ 20) వరల్డ్ వైడ్‌గా ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది. సుదీర్ఘ విరామం తర్వాత ఉపేంద్ర దర్శకత్వం వహించిన నటించడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు నెలకొన్నాయి. దీంతో ఎన్నో అంచనాల మధ్య రేపు ఈ మూవీ థియేటర్లోకి రాబోతోంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా తెలుగు ఆడియన్స్‌తో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూవీ విశేషాలను పంచుకున్నారు. ‘యూఐ’ సినిమాతో సరికొత్త కాన్సెప్ట్‌తో వస్తున్నామని, ఈ సినిమా క్లైమాక్స్ సైతం మీరు ఊహించిన దానికంటే కొత్తగా ఉంటుందని అన్నారు. దీంతో ఆయన కామెంట్స్ మూవీపై హైప్ క్రియేట్ చేసింది.
కాగా ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా అన్ని సినిమాలు ఇతర భాషల్లోనూ మంచి విజయం సాధిస్తున్నాయి. కథ, కథనం బాగుండే ఏ భాష చిత్రాన్నైనా ఆడియన్స్ ఆదరిస్తున్నారు. ఇక కన్నడ డబ్బింగ్ చిత్రాలకు సైతం ఇక్కడ మంచి ఆదరణ పొందుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉపేంద్ర ‘యూఐ’ సినిమా ఎంతమేర కలెక్షన్లను సాధిస్తాయని ట్రేడ్ వర్గాలు అంచనాలు వేస్తున్నాయి. ‘యుఐ’ డబ్బింగ్ చిత్రమైనప్పటికీ టాలీవుడ్ లో ఉపేంద్ర సినిమాలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. దీంతో ఈ సినిమా బుకింగ్స్‌కి కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ సినిమాతో మరోసారి వింటేజ్ ఉపేంద్ర దర్శకత్వాన్ని చూడోచ్చిన ఆయన అభిమానులంతా ఆసక్తిగా ఉన్నారు.