Last Updated:

Ayyannapatrudu: మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు అరెస్ట్

తెదేపా నేత, మాజీ మంత్రి, పొలిట్ బ్యూరో సభ్యుడు అయిన చింతకాయల అయ్యన్నపాత్రుడిని ఏపీ సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. ఆయన కుమారుడు రాజేశ్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు.

Ayyannapatrudu: మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు అరెస్ట్

Ayyannapatrudu: తెదేపా నేత, మాజీ మంత్రి, పొలిట్ బ్యూరో సభ్యుడు అయిన చింతకాయల అయ్యన్నపాత్రుడిని ఏపీ సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. ఆయన కుమారుడు రాజేశ్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు.

ఇంటి గోడ కూల్చివేత అంశంలో ఫోర్జరీ పత్రాలు సమర్పించారని అయ్యన్నపై గతంలో అభియోగాలున్నాయి. ఈ కేసులో మొదటి నిందితుడిగా అయ్యన్నపాత్రుడు, రెండో నిందితుడిగా విజయ్, మూడో నిందితుడిగా రాజేష్ ఉన్నారు. ఈ నేపథ్యంలో నర్సీపట్నంలో గురువారం తెల్లవారు జామున భారీ ఎత్తున పోలీసులు ఆయన ఇంటి గోడ దూకి మరీ ఇంట్లోకి ప్రవేశించారు. అనంతరం అయ్యన్నకు నోటీసులు అందజేసి అరెస్టు చేశారు. ఆయన కుమారుడు చింతకాయల రాజేశ్‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీఐడీ పోలీసులు అయ్యన్నపై పలు నాన్‌ బెయిలబుల్‌ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఏలూరు కోర్టులో అయ్యన్నను హాజరుపరుస్తామని పోలీసులు చెప్పారు.

అయితే తన భర్తకు, కుమారుడికి ప్రాణ హాణీ ఉందని అయ్యనపాత్రుడి భార్య పద్మావతి ఆరోపించింది. ఈ విషయంపై స్పందించిన చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. గోడదూకి ఇంట్లోకి ప్రవేశించడం ఏంటని సీఐడీ అధికారుల తీరుపై మండిపడ్డారు. అయ్యన్న కుటుంబ సభ్యులను ఫోన్ కాల్ ద్వారా పరామర్శించారు.

ఇదీ చదవండి: మునుగోడులో మొదలైన పోలింగ్

ఇవి కూడా చదవండి: