Last Updated:

BCCI Ganguli: బీసీసీఐ నుంచి దాదా అవుట్

బీసీసీఐ అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ నిష్ర్కమణ తేదీ ఖరారయ్యింది. గత మూడేళ్లుగా భారత క్రికెట్ లో చక్రం తిప్పిన గంగూలీ పదవీకాలం ఈనెల 18తో ముగియనుంది. ఇకపోతే ఐసీసీ చైర్మన్ పదవి కూడా దాదాకు దాదాపుగా దూరం అయినట్లే తెలుస్తోంది.

BCCI Ganguli: బీసీసీఐ నుంచి దాదా అవుట్

BCCI Ganguli: బీసీసీఐ అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ నిష్ర్కమణ తేదీ ఖరారయ్యింది. గత మూడేళ్లుగా భారత క్రికెట్ లో చక్రం తిప్పిన గంగూలీ పదవీకాలం ఈనెల 18తో ముగియనుంది. ఇకపోతే ఐసీసీ చైర్మన్ పదవి కూడా దాదాకు దాదాపుగా దూరం అయినట్లే తెలుస్తోంది.

1983 ప్రపంచ కప్ హీరో రోజర్ బిన్నీ(కర్ణాటక) బోర్డు తదుపరి బీసీసీఐ అధ్యక్షుడిగా ఎన్నికవనున్నాడు. ఈనెల 18న ముంబైలో జరిగే వార్షిక సర్వసభ్య సమావేశంలో బీసిసిఐ 36వ అధ్యక్షుడిగా బిన్నీ బాధ్యతలు చేపట్టనున్నాడు. ఢిల్లీలో గత వారం రోజుల పాటు గంగూలీ తీవ్ర చర్చలు సాగించారు. రెండో దఫా అధ్యక్షుడిగా కొనసాగేందుకు గంగూలీ ఆకస్తికనపరిచినా అతనికి నిరాశే ఎదురైంది. బీసీసీఐ అధ్యక్ష పదని ఏ వ్యక్తికి రెండో దఫా ఇచ్చే సంప్రదాయం లేదని బోర్డు స్పష్టం చేసింది. ఇకపోతే కేంద్ర హోంమంత్రి అమిత్ షా తనయుడు జై షా రెండోసారి కార్యదర్శిగా కొనసాగనున్నారు. ఐసీసీ బోర్డులో బీసీసీఐ ప్రతినిధిగా కూడా జై షానే ఆ స్థానాన్ని భర్తీ చేయనున్నట్టు సమాచారం.
‘బీసీసీఐ తరఫున ఐసిసి వ్యవహారాలను చక్కబెట్టడంలో జై షా ముందున్నాడని, 2023 ప్రపంచ కప్ ఉన్న నేపథ్యంలో భారత్ కు బలమైన నాయకత్వం ఉండటం చాలా ముఖ్యం’ అని బిసిసిఐ వర్గాలు వెల్లడించాయి.

గంగూలీకి ఐపీఎల్ చైర్మన్ పదవిని ఇస్తామనగా దానిని అతను సున్నితంగా తిరస్కరించాడు. అయితే బీసీసీఐలోని వివిధ పదవులకు గాను ఈనెల 12తో నామినేషన్ల దాఖలు గడువు పూర్తవుతుందని, ఈనెల 14లోపు నామినేషన్లు ఉపసంహరించుకోవచ్చని బోర్టు తెలిపింది. ఇకపోతే ఈ నెల 15న వివిధ పదవులకు బరిలో నిలిచిన అభ్యర్థుల వివరాలను ప్రకటిస్తారు.

ఇదీ చదవండి: చరిత్ర సృష్టించిన టీంఇండియా.. ఏ దేశజట్టూ దీన్ని బీట్ చెయ్యలేదు..!

ఇవి కూడా చదవండి: