Last Updated:

Bharat Jodo Yatra: జోడో యాత్రలో పాల్గొననున్న సోనియా, ప్రియాంకలు

కన్యాకుమారి టు కాశ్మీర్ వరకు తలపెట్టిన భారత్ జోడో యాత్ర 17వ రోజుకు చేరుకొనింది. ఈ నెల 30న కర్ణాటకలోకి రాహుల్ పాదయాత్ర ప్రవేశించనున్న నేపధ్యంలో కర్ణాటక పిసిసి తగిన ఏర్పాట్లు చేసింది. కర్ణాటకలో చేపట్టే జోడో యాత్రలో సోనియా గాంధీ, ప్రియాంకా గాంధీ వాద్రాలు పాల్గొననున్నారు

Bharat Jodo Yatra: జోడో యాత్రలో పాల్గొననున్న సోనియా, ప్రియాంకలు

Kerala: కన్యాకుమారి టు కాశ్మీర్ వరకు తలపెట్టిన భారత్ జోడో యాత్ర 17వ రోజుకు చేరుకొనింది. తమిళనాడు నుండి ప్రారంభమైన యాత్ర కేరళలో కొనసాగుతుంది. రాహుల్ గాంధీ తనదైన శైలిలో జోడో యాత్ర ఉద్ధేశాన్ని, అధికార పార్టీ పోకడను ఎత్తిచూపుతూ మరీ పాదయాత్రను కొనసాగిస్తున్నారు. దీంతో రాహుల్ కు, కాంగ్రెస్ పార్టీకి మంచి మైలేజ్ ఇచ్చింది. పాదయాత్రలో ఆ పార్టీ అధినేత్రితో పాటు సోదరి ప్రియాంకా గాంధీ వాద్రా కూడా పాల్గొననున్నారు.

ముందస్తుగా నిర్ణయించిన మేర భారత్ జోడోయాత్ర 30వతేదిన కర్ణాటకలోకి ప్రవేశిస్తుంది. ఈ క్రమంలో మరింతగా ప్రజల్లోకి చేర్చేందుకు కాంగ్రెస్ పార్టీ గట్టి ప్రణాళికలను రూపొందిస్తుంది. కర్ణాటకలో చేపట్టే భారత్ జోడో యాత్రలో ఆ పార్టీ అధినేత్రి సోనియాగాంధీతో పాటు ప్రియాంకా గాంధీ కూడా రాహుల్ కు జత కల్పుతూ పాదయాత్రలో పాల్గొనేలా కర్ణాటక పిసిసి అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసింది. కేవలం ఒక్క రోజు మాత్రమే వీరిద్దరూ పాదయాత్రలో పాల్గొననున్నారు. అయితే అమ్మ సోనియా, సోదరి ప్రియాంకలతో వేర్వేరు రోజులలో రాహుల్ పాదయాత్రలో పాల్గొంటారని నేతలు పేర్కొన్నారు. కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటి అధ్యక్షులు శివకుమార్ నేతృత్వంలో రాహుల్ భారత్ జోడో యాత్ర ను చేపట్టనున్నారు. ఇప్పటికే ఏఐసిసి ఇందుకు సంబంధించిన ఏర్పాట్ల పట్ల కూడ సంతృప్తి వ్యక్తం చేసిన్నట్లు కీలక నేతలు పేర్కొన్నారు.

పాదయాత్రలో ఎవ్వరికి ఇబ్బందులు కులుగకుండా కార్యకర్తలకు, సేవా దళ్ సభ్యులకు వైద్య శిభిరాలతో పర్యవేక్షణ చేసుకొంటూ భారత జోడో యాత్రను కొనసాగిస్తున్నారు. రాహుల్ గాంధీ కూడా స్ధానిక సమస్యలు అవగాహన చేసుకొంటూ, వాటి పై పూర్తి స్థాయిలో నివారణ చర్యల పై తగిన సూచనలను అందించాలని పార్టీ శ్రేణులకు దిశ, నిర్ధేశాలు చేస్తూ ముందుకు సాగుతున్నారు. భాజపా పార్టీతో పడుతున్న ప్రజల బాధల నుండి విముక్తితో పాటు 2024లో జరిగే లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయ ఢండా మోగించడమే ప్రధాన లక్ష్యంగా పాదయాత్రను కాంగ్రెస్ పార్టీ చేపట్టింది.

ఇవి కూడా చదవండి: