Last Updated:

Vundavalli Anusha: టీడీపీ మ‌హిళా నేత ఉండ‌వ‌ల్లి అనూష‌ పై కేసు నమోదు

టీడీపీ మ‌హిళా నేత ఉండ‌వ‌ల్లి అనూష‌ పై అనంతపురం జిల్లా శింగనమల పోలీసులు కేసు నమోదు చేసారు. శింగనమల ఎమ్మెల్యే జొన్న‌ల‌గ‌డ్డ ప‌ద్మావ‌తి పై సోష‌ల్ మీడియాలో అనుచిత వ్యాఖ్య‌లు చేసారంటూ భీమిశెట్టి శ్రీనివాసులు అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదయింది.

Vundavalli Anusha: టీడీపీ మ‌హిళా నేత ఉండ‌వ‌ల్లి అనూష‌ పై కేసు నమోదు

Andhra Pradesh: టీడీపీ మ‌హిళా నేత ఉండ‌వ‌ల్లి అనూష‌ పై అనంతపురం జిల్లా శింగనమల పోలీసులు కేసు నమోదు చేసారు. శింగనమల ఎమ్మెల్యే జొన్న‌ల‌గ‌డ్డ ప‌ద్మావ‌తి పై సోష‌ల్ మీడియాలో అనుచిత వ్యాఖ్య‌లు చేసారంటూ భీమిశెట్టి శ్రీనివాసులు అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదయింది.

ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్య‌ల‌ పై 3 రోజుల్లోగా సంజాయ‌షీ ఇవ్వాలంటూ ఉండ‌వ‌ల్లి అనూష‌కు ఏలూరులోని ఆమె ఇంటి వ‌ద్దే శింగ‌న‌మ‌న‌ల పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఏలూరులోని ఆర్ఆర్‌పేట‌లో వ‌స్త్ర దుకాణం నిర్వ‌హిస్తున్న అనూష వ‌ద్ద‌కు అనంత‌పురం పోలీసులు వెళ్లారు. 41ఎ కింద ఆమెకు నోటీసులు అంద‌జేశారు. మూడు రోజుల్లోపు వివ‌ర‌ణ ఇవ్వాల‌ని కోరారు.

మరోవైపు అస‌లు పోలీసులు తన‌విగా చెబుతున్న ఐడీలతో త‌న‌కు ఏ మాత్రం సంబంధం లేద‌ని అనూష అంటున్నారు. ఎవ‌రో ఏదో ఫిర్యాదు చేస్తే, అంత దూరం నుంచి వ‌చ్చి నోటీసు ఇవ్వ‌డం ఏంట‌ని ఆమె ప్ర‌శ్నించారు. న్యాయ‌స్థానాన్ని ఆశ్ర‌యించ‌నున్న‌ట్టు ఆమె తెలిపారు.

ఇవి కూడా చదవండి: