Last Updated:

Shakib Al Hasan: భారత్ ను ఓడించడానికే ఇక్కడకు వచ్చాం.. బంగ్లా కెప్టెన్ షకీబ్

టీ20 ప్రపంచకప్‌ 2022 సూపర్‌-12లో భాగంగా బుధవారం నవంబర్‌ 2న బంగ్లాదేశ్‌తో భారత్ తలపడనుంది. ఆడిలైడ్‌ వేదికగా రేపు మధ్యాహ్నం 1.30కు మ్యాచ్ ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలోనే బంగ్లా కెప్టెన్ భారత జట్టుపై చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

Shakib Al Hasan: భారత్ ను ఓడించడానికే ఇక్కడకు వచ్చాం.. బంగ్లా కెప్టెన్ షకీబ్

Shakib Al Hasan: టీ20 ప్రపంచకప్‌ 2022 సూపర్‌-12లో భాగంగా బుధవారం నవంబర్‌ 2న బంగ్లాదేశ్‌తో భారత్ తలపడనుంది. ఆడిలైడ్‌ వేదికగా రేపు మధ్యాహ్నం 1.30కు మ్యాచ్ ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలోనే బంగ్లా కెప్టెన్ భారత జట్టుపై చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

సౌతాఫ్రికాతో ఇటీవల జరిగిన మ్యాచ్లో పరాభవం ఎదుర్కొన్న టీంఇండియాకు ఈ మ్యాచ్ గెలవడం ఎంతో కీలకంగా మారింది. ఈ మ్యాచ్ విన్ అయితే భారత జట్టు సెమీస్ బెర్త్ దాదాపు ఖాయం అయినట్టే. ఇదిలా ఉండగా మరోవైపు బంగ్లాకు కూడా ఈ మ్యాచ్‌ గెలవడం చాలా కీలకం. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో టీమిండియాతో సమానంగా ఉన్న బంగ్లా.. భారత్‌పై గెలిస్తే సెమీస్ అవకాశాలను మరింత మెరుగు పరుచుకుంటుందనే చెప్పాలి. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్ రసవత్తరంగా సాగనుంది.

టీ20 ప్రపంచకప్ 2022 టైటిల్‌ను గెలుచుకునే ఫేవరెట్‌ జట్లలో భారత్‌ ఒకటని బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ పేర్కొన్నాడు. భారత్‌తో మ్యాచ్ నేపథ్యంలో షకీబ్ అల్ హసన్ మీడియా ఎదుట బంగ్లాదేశ్ ప్రపంచ కప్ గెలవడానికి ఆస్ట్రేలియాకు రాలేదని.. టైటిల్ ఫేవరెట్ అయిన భారత్‌ను దెబ్బతీసేందుకే వచ్చామని తెలిపారు. ‘మేము భారత్‌పై గెలిస్తే.. కచ్చితంగా వారు అప్‌సెట్ అవుతారు. టీమిండియాపై మా అత్యుత్తమ క్రికెట్ ఆడటానికి ప్రయత్నిస్తాము కచ్చితంగా టీమిండియాను నిరాశపరిచేందుకు ప్రయత్నిస్తామని ఆయన వెల్లడించారు. భారత బ్యాటర్లను ఆపడానికి ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నామని, మేము గెలవాలంటే భారత టాప్ క్లాస్ ఆటగాళ్లను అడ్డుకోవాల్సి ఉందని షకీబ్ అల్ హసన్ అన్నాడు.

ఇదీ చదవండి: టీ20 వరల్డ్ కప్ గ్రూప్-2లో సెమీస్ ఛాన్స్ ఏఏ జట్లకంటే..?

ఇవి కూడా చదవండి: