Last Updated:

Telangana High Court: జగన్ బెయిల్ రద్దుకు సరైన కారణాలు లేవు.. ఎంపీ రఘురామరాజు పిటిషన్ కొట్టివేసిన తెలంగాణ హైకోర్టు

అక్రమాస్తుల వ్యవహారంలో సీబీఐ నమోదు చేసిన కేసులో ప్రధాన నిందితుడైన ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయడానికి సరైన కారణాలు లేవంటూ శుక్రవారం తెలంగాణ హైకోర్టు పేర్కొంది.

Telangana High Court: జగన్ బెయిల్ రద్దుకు సరైన కారణాలు లేవు.. ఎంపీ రఘురామరాజు పిటిషన్ కొట్టివేసిన తెలంగాణ హైకోర్టు

Hyderabad: అక్రమాస్తుల వ్యవహారంలో సీబీఐ నమోదు చేసిన కేసులో ప్రధాన నిందితుడైన ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయడానికి సరైన కారణాలు లేవంటూ శుక్రవారం తెలంగాణ హైకోర్టు పేర్కొంది. అందువల్ల బెయిలును రద్దు చేస్తూ ఉత్తర్వులు ఇవ్వలేమంటూ ఎంపీ రఘురామ కృష్ణంరాజు దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టివేస్తున్నట్లు వెల్లడించింది.

ముఖ్యమంత్రిగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని, సాక్షులను ప్రభావితం చేస్తున్నందున బెయిల్ రద్దు చేయాలన్న అభ్యర్థునను సిబిఐ కోర్టు కొట్టి వేయడంతో ఎంపీ రఘురామ కృష్ణంరాజు హైకోర్టులో పిటిషన్ వేశారు. దీని పై విచారించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ శుక్రవారం తన తీర్పు వెలువరించారు. ‘జగన్ ద్వారా బెదిరింపులు, ప్రలోభాలకు గురైన సాక్షుల వివరాలు వెల్లడించలేదు. అధికార దుర్వినియోగానికి పాల్పడి సహ నిందితులకు కీలక పదవులను కట్టబెట్టడం ద్వారా సాక్ష్యాలను తారుమారు చేయడం, సాక్షులను ప్రభావితం చేస్తారు అన్నవి సరైన కారణాలు కావు.

బెయిల్ రద్దు కోరుతూ సిబిఐ దాఖలు చేసిన పిటిషన్ ను సిబిఐ కోర్టు 2021 సెప్టెంబర్ 15న కొట్టివేసింది. అప్పటికీ ఇప్పటికీ పరిస్థితిలో ఎలాంటి మార్పు లేవని సిబిఐ పేర్కొంది. అన్ని అంశాలను పరిశీలించిన మీదట బెయిల్ రద్దు కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ లో జోక్యానికి ఎలాంటి కారణాలు లేవు’ అని తీర్పు వెలువరించారు.

ఇవి కూడా చదవండి: