Last Updated:

Railway Jobs 2022: రాత పరీక్ష లేకుండా రైల్వే జాబ్స్ వెంటనే అప్లై చేసుకోండి!

ఈ పరీక్షకు అప్లై చేయడానికి 2022 అక్టోబర్ 29 వరకు మాత్రమే. మెరిట్ లిస్ట్ 2022 డిసెంబర్‌లో విడుదలవుతుంది. అభ్యర్థులు ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు ఈ జాబ్ నోటిఫికేషన్‌కు సంబంధించిన విద్యార్హతలు, దరఖాస్తు ఫీజు కింద చదివి తెలుసుకుందాం.

Railway Jobs 2022: రాత పరీక్ష లేకుండా రైల్వే జాబ్స్ వెంటనే అప్లై చేసుకోండి!

Railway Jobs: భారతీయ రైల్వేలో ఉద్యోగాల భర్తీకి మరో జాబ్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈస్టర్న్ రైల్వేకు చెందిన రైల్వే రిక్రూట్‌మెంట్ అప్రెంటీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది. మొత్తం 3115 పోస్టుల్ని భర్తీ చేయనుందని నోటీఫకేషన్లో పేర్కొన్నారు.

మొత్తం 3115 ఖాళీలు ఉండగా వాటిలో మాల్దా డివిజన్- 138, అసన్సోల్ వర్క్‌షాప్- 412, జమాల్‌పూర్ వర్క్‌షాప్- 667, హౌరా డివిజన్- 659, లిలువా వర్క్‌షాప్- 612, సీల్దాహ్ డివిజన్- 440, కంచ్రపార వర్క్‌షాప్- 187 పోస్టులున్నాయి. ఇవన్నీ అప్రెంటీస్ పోస్టులు మాత్రమే. ఈ పరీక్షకు అప్లై చేయడానికి 2022 అక్టోబర్ 29 వరకు మాత్రమే. మెరిట్ లిస్ట్ 2022 డిసెంబర్‌లో విడుదలవుతుంది. అభ్యర్థులు ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు ఈ జాబ్ నోటిఫికేషన్‌కు సంబంధించిన విద్యార్హతలు, దరఖాస్తు ఫీజు కింద చదివి తెలుసుకుందాం.

కావలిసిన విద్యార్హతలు..
విద్యార్హతల వివరాలు చూస్తే ఒక్కో పోస్టుకు ఒక్కోలా విద్యార్హతలున్నాయి. ఈ పోస్టులకు అప్లై చేసే అభ్యర్థులు 10వ తరగతితో పాటు సంబంధిత ట్రేడ్‌లో ITI పాస్ కావాలి. అభ్యర్థుల వయస్సు 15 ఏళ్ల నుంచి 24 ఏళ్ల లోపే ఉండాలి. అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే ఫీజు ఫీజు రూ.100 చెల్లించాలిసి ఉంటుంది. SC, ST మహిళలు, దివ్యాంగులకు ఎలాంటి ఫీజు లేదు. ఎంపిక విధానం మెరిట్ లిస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

ఇవి కూడా చదవండి: