Last Updated:

Rahul’s Jodo Yatra: 200 కి.మీ దాటిన రాహుల్ జోడో యాత్ర

భారతీయులను ఒక తాటిపైకి తీసుకొచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన భారత్ జోడో యాత్ర 200కి.మీ మైలు రాయిని దాటింది. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ 12రోజున కూడా ఉత్సాహంగా తన పాదయాత్రను కొనసాగించారు

Rahul’s Jodo Yatra: 200 కి.మీ దాటిన రాహుల్ జోడో యాత్ర

Jodo Yatra crossed 200 km: భారతీయులను ఒక తాటిపైకి తీసుకొచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన భారత్ జోడో యాత్ర 200కి.మీ మైలు రాయిని దాటింది. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ 12రోజున కూడా ఉత్సాహంగా తన పాదయాత్రను కొనసాగించారు.

రాహుల్ గాంధీ సోమవారం కేరళలోని అలప్పుజాలోని వడకల్ బీచ్‌లో మత్స్యకారులతో సంభాషించారు. పెరుగుతున్న ఇంధన ధరలు, తగ్గిన సబ్సిడీలు, తగ్గుతున్న చేపల నిల్వలపై చర్చలు జరిపారు. విద్యావకాశాలు, ఇతర సమస్యలతోపాటు పర్యావరణ విధ్వంసంపై వారితో రాహుల్ వారితో మాట్లాడారు. కాంగ్రెస్ ఎంపీలు పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి అలప్పుజాలోని పున్నప్రా అరవుకడ్ నుంచి జోడోయాత్ర ప్రారంభమైంది.

మతం, వర్గాలకు అతీతంగా భారతీయులను ఒక్కతాటిపైకి తీసుకురావడమే భారత్ జోడో యాత్ర స్ఫూర్తి అని, ఇది ఒకటే దేశమని, ఒకరిపట్ల ఒకరు గౌరవంగా ఉంటేనే విజయవంతమవుతుందని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.

పున్నమాడ లేక్లో నిర్వహించిన స్నేక్ బోట్ రేస్ ఎగ్జిబిషన్లో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. స్నేక్ బోట్ రేస్‌లో రాహుల్ కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ రేసులో రెండు బోట్లు పాల్గొనగా రాహుల్ ఉన్న బోట్ విజయం సాధించింది. దీంతో ఆయన ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. స్నేక్ బోట్ రేసులో రాహుల్ గాంధీ తో పాటు కేరళ మంత్రి పాల్గొన్న వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్లో వైరల్గా మారింది.

ఇవి కూడా చదవండి: